కాలం వంతెన మీద..
ఐనా ఇక్కడ నా దేహం నాది అన్న స్వరాలు శ్రమ శక్తులవుతాయి విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు పొలాల్లో బురద కాళ్లను నాగలి కర్రులు చేసి రాజనాలు పండిస్తారు విత్తనమై ఈ మట్టి పొరలతోనే స్నేహం చేస్తారు
నా నేల మీద మందిరాలు,
మసీదులున్నాయి
గురుద్వారాలు, చర్చీలు ఉన్నాయి
జైన దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు
పార్శీల ప్రార్థ్ధనా మందిరాలు,
మరెన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి
ఐనా ఇక్కడ
నా దేహం నాది అన్న స్వరాలు
శ్రమ శక్తులవుతాయి
విశ్వాసమున్న వాడు, నమ్మకం లేనివాడు
ఇద్దరూ కలిసి చెమటోడ్చే కూలీలవుతారు
పొలాల్లో బురద కాళ్లను
నాగలి కర్రులు చేసి
రాజనాలు పండిస్తారు
విత్తనమై ఈ మట్టి పొరలతోనే
స్నేహం చేస్తారు
ఆకలికి కడుపు నింపి,
ఎండిన డొక్కలకు సేద దీర్చి
తిరిగి శ్రమ శక్తికి ఊపిరి అవుతారు
శ్రమకు, ఆకలికి కులం లేదు, మతం లేదు
మట్టికి జాతి లేదు, వర్ణం లేదు
విత్తనానికి మందిరం లేదు, మసీదు లేదు,
గురుద్వార లేదు, చర్చీలేదు
ఆకలి కడుపే దాని నివాసం,
మట్టి పొరలే దాని అంగ వస్త్రం
కారుణ్యమే దాని గుణం,
త్యాగమే దాని కులం
మనం విత్తనమవుదాం,
ఈ మట్టికి శ్వాస అవుదాం
ప్రసూతిలో ప్రసవవేదన
పడుతున్న తల్లి ఈ నేల
కొత్త జన్మకు స్వాగతిద్దాం,
కాలం వంతెన మీద నిలబడి
కొత్త పాట పాడుకుందాం ..
– డాక్టర్ రూప్ కుమార్ డబ్బీకార్ 99088 40186
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

