ఇప్పుడొక వసంతం కావాలి

చరిత్ర గమనాన్ని నిర్దేశిస్తుంటే
వర్తమాన ఆశల ఆవిరులు నిరాశల దారుల్లో నీరుగారిపోతున్నాయి..!!
మూసిన తలుపు సందుల్లోంచి సన్నటి వెలుగు దారాన్ని ఆసరా చేసుకొని ప్రపంచాన్ని పిడికిలిలో బిగించాలనే వెర్రి ఆశ భుజాలపై బ్రతుకు భారాన్ని
వెక్కిరిస్తూనే వుంది!!
అంధకారాన్ని మోస్తూ అంతరాల నిచ్చెనలు వేస్తుంటేదారి తప్పిన జీవితాలకు సమాంతర లెక్కల్లో అన్నీ అసమాన గీతలే..!!
శూన్యాన్ని మోస్తూ ఏ శిఖరాన్ని చేరినా గమ్యమంతా అగమ్యగోచరమే..!!
మసకేసిన మబ్బులు కల్లోల వర్షంలో తడుస్తుంటే శిశిరాలు రాజ్యాలేలుతున్నాయి..
ఆర్తనాదాలన్నీ విస్తరిస్తుంటే చీకటి బ్రతుకుల్లో వెలుగు నీడ ఎక్కడ?
చైతన్యపు దివిటీలు వెలిగించడానికి..ఇప్పుడొక వసంతం కావాలి..
మానవత్వపు పుటలలో మాటు వేసి చిచ్చు రేపుతున్న అలజడులను తరిమికొట్టాలి
మానవత్వం చిగురించడానికి
మనిషి తత్వాన్ని నిద్రలేపాలి..
నవ చైతన్యానికి నాందిగా
నలు దిక్కులు సస్యశ్యామలమై వర్ధిల్లాలి..!!
స్వప్న మేకల
9052221870
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- Edit page
- literature
- సాహిత్యం
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

