కృషి నా సర్వస్వం

అయినా సరే
నేను రైతుగానే వుంటాను
రైతుగా పుట్టాను
రైతుగానే మరణిస్తాను..
కడగండ్లు రాలేదని కాదు
కరువులు కన్నీటి చెరువులైనా
చెక్కుచెదరలేదు..
అకాల వర్షాలు
కాలజ్ఞాన నైరాశ్యానికి
దారితీసినా బెదరలేదు..
పండిన ధాన్యానికి
దళారీ పురుగులు పట్టినా
మిగిలిన గింజల్తో గడుపుకొస్తున్నాను..
ఈ వృత్తిలోని అందమైన
నైష్పత్తిక సుఖమేమిటో
ఈ మట్టితో జరిపే
ఆత్మీయ సంభాషణలోని
ఆనందమేమిటో
నేనింకా మర్చిపోలేదు..
ఆకాశం వైపు చూసీ చూసీ
కండ్లు శుక్లాల దాకా వచ్చాయి!
నిలబడీ నిలబడీ
కాళ్ళల్లో వెరికోస్ పాములు చొరబడ్డాయి..
అయినా సరే..
నిబ్బరాన్ని వదిలిపెట్టలేదు
నిజాయితీని కోల్పోలేదు
రైతుకు అన్యాయం చేసేవాడు
నిజంగా సిగ్గుపడాలి
పండిన గింజల మీద
అతని పేరును గీకెయ్యలేరు కదా!
రైతులాంటి గొప్ప జీవితం
ఎవరికొస్తుంది కనుక
నిటారుగా జీవించే
ఈ శిరశ్శిఖరం ముందు
నింగి నివ్వెరపోతుంది..
అందరికీ అన్నం
ప్రసాదిస్తున్నామనే భావన
అమ్మలాంటిది కదా నాయనా..!
–డాక్టర్ ఎన్. గోపి
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- Edit page
- literature
- సాహిత్యం
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Jarkiholi | కర్ణాటకలో కోటి ఓట్ల తొలగింపు సరైనదే.. ‘సర్’ ను సమర్థించిన కాంగ్రెస్ సీనియర్ నేత జర్కిహోళి..!
‘నగర పారిశుధ్యానికి శ్రమించే కార్మికుల ఆరోగ్యమే ముఖ్యం’
Vaibhav Sooryavanshi: చలినీళ్లు తాగకు.. సూర్యవంశీకి అభిమాని సలహా.. వీడియో
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

