సారు కొన్ని నవ్వులు
మా గుడిసెలకు కూడా ఇయ్యండి
ఎంతకాలం ఈ చీకట్లో బతుకమంటారు
ఎన్నో ఏండ్ల నుంచి దుఃఖపు నీళ్లలో
తడుస్తూ ఉన్నాము
బీదరికపు ముళ్లతో సావాసం చేస్తున్నాము
ఆకలి నీడలో ముదురుకుంటున్నాము
ఎంత దులిపినా, ఎంత కష్టంతో కడిగినా
వీడని మరకలా అంటుకునే ఉన్నాయి
సావో రేవో తేల్చుకున్న తెగిపోతలేవు
మీరే దయవుంచి కొన్ని నవ్వులు
మా దోసిళ్లలో వెయ్యండి సార్
మీ బొమ్మలను మా పూరిగుడిసెలో
పెట్టుకుంటాము
– గుండెల్లి ఇస్తారి 9849983874