బతుకు పెట్టె
అయిదవ తరగతిల హాస్టల్‌కు పోతుంటే
అయిదవ తరగతిల
హాస్టల్‌కు పోతుంటే
నాన్న కొనిచ్చిన ట్రంకు పెట్టె
అరచెయ్యంత మందం
ఏ చేతి నైపుణ్యమో గానీ
నలభై ఏండ్లయినా గింత
సొట్టలు పోలే, చిల్లులు పడలే
పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు, కొబ్బరి
నూనె సీస, సబ్బుల బిల్ల, మాడ్చిన కారం,
గురిగి, లాకర్లా దాసి పెట్టుకునేది
కంపాక్స్ బాక్స్, దువ్వెన అద్దం,
వ్యాజిలైను, అన్నీ కోడిపెట్టలా కప్పుకునేది
ఎప్పుడూ ఏదడిగినా
అమ్మలా అడిగినట్టే ఇచ్చేది
భూమి పర్వతాన్ని మోసినట్టు
నా బరువంతా మోసింది
పదవ తరగతి వరకు
నాకు ఒక అపురూపమే
అలిసి పోయినప్పుడు కుర్చయ్యేది
స్నేహితులకు కూడ చోటిచ్చేది
తలకింద దిండయ్యేది
రాసుకోవడానికీ ప్యాడయ్యేది
పాటకు దరువులయ్యేది
కిరాయిల్లు మారినప్పుడల్లా
పడేద్దమంటరు కానీ
నా బాల్యాన్ని మోసిన అమ్మలాంటి అమ్మ
ఇన్నేండ్లయినా ముడతలు పడలే
ఇస్త్రీ చేసిన ప్యాంటులా కడక్ ఉంటది
పదేండ్లు నన్ను కడుపుల
పెట్టుకొని అమ్మై మోసింది
ఇల్లు మారినప్పుడల్లా భుజాల మీద
పెట్టుకొని తిరుగుతుంటే హాస్టళ్ల రూమ్
రూమ్ తిరిగిన జ్ఞాపకాలే…
పెట్టెను తెరిచినప్పుడల్లా
బొడ్డుమల్లెలు విచ్చుకున్నట్టే
ఒకనాడు లాగుజేబుల తాళం
చెవెట్లనో జారిపోయింది
చిలుకును ఇరుగ్గొడుదామన్నరు పానమెందుకో ఒప్పుకోలే
బడి నుంచి హాస్టల్‌కు నాలుగు మైళ్లు
నాలుగు సార్లు తిరిగి దేవులాడినా దొరుకలే
నెత్తిన పెట్టుకాని సంతల
పూసల పుల్లయ్య తానికోయిన
ఒక్క దెబ్బకొట్టకుండ చిటుక్కున తెరిచిండు
ఎంత పనితనమో.. ఒక మిరాకిలే
బస్టాండ్ల బస్సుల్లో అప్పుడప్పుడు
హాస్టల్ పిల్లలు రేకు పెట్టెలతో ఎక్కి దిగుతుంటరు అమ్మనాన్నలతో
వాళ్లను చూసినప్పుడల్లా నా జ్ఞాపకాలను తోడుకుంటాను
నా భుజాల మీద పెట్టెనే అనుకొని బాల్య అనుభూతులతో పరవశించిపోతాను
ఇంట్లకు బీరువొచ్చినాక
ఎన్నడు తెరిచి చూడలే
కాళ్లకు అడ్డం తగిలినప్పుడల్లా
మనసున దండం పెట్టుకునేది
పారెయ్యాలంటే పానమొప్పుకోదు
తెచ్చినప్పుడే గానీ
మల్లెప్పుడు రంగెయ్యలే
పచ్చని వార్నీసుతో మెరుస్తూనే ఉంటది
నలుగురు కూసున్నా ఇంత కూడ పాడుగాలే
పిల్లలు పెట్టెనెక్కి తొక్కుతుంటరు
చూసినప్పుడల్లా మనసు చలించి కలుక్కుమంటది
దాంట్ల బంగారముందా తొక్కొద్దు తొక్కొద్దంటవు అని నన్నే గసిరిచ్చి ఎదిరిచ్చే పిల్లలు
అమ్మా! అందులో ఏమిలేవు గానీ
నన్ను వెలిగించిన అక్షరాలున్నాయి
మెదడును సానపెట్టిన ఆకురాళ్లున్నవి
సెల్ఫ్ గవర్నమెంట్‌కు దిగిన
గ్రూప్ ఫోటో ఉంది
బాల్యంలో రాసిన కవితల తడులున్నవి
స్నేహితుల ఉత్తరాల గుండె స్పందనలున్నయి
బొట్టు పెట్టె, ట్రంకు పెట్టె,
సారె పెట్టె, పీర్ల పెట్టె, దేవుని పెట్టె
సొమ్ముల పెట్టె, బోషాణాల కన్నా
నన్ను నడిపిచ్చిన బతుకు పెట్టె నా గుండె పెట్టె
వనపట్ల సుబ్బయ్య
94927 65358
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

