గతించిన కాలం ఎంతగా
నెమరేసుకున్న
తీరని జ్ఞాపకాలు
కాలం పాపం పగబట్టిందో ఏమో
కుక్కలు చింపిన ఇస్తరైంది
భవిష్యత్తు
కలలకు రంగులద్ది
ఇంద్రధనస్సు ఆకాశం నుంచి
ఇలకు దిగినట్టుగా
ఆశల పల్లకిలో ఊరేగుతుంది
నిద్ర దుప్పటి కప్పుకున్న రాత్రి
కలలు స్వప్నాలు విరబూసింది
జన జీవన స్రవంతిలో ఉన్న పగలు
ఏకాంతంగా కారడవిలోకి
దూరిపోయింది
మనుషులను పోగేసే ఐదు వేళ్ల పిడికిలి
మందలో తప్పిన
గొర్రె పిల్లలా ఒకటే అల్లరి
యుద్ధంలో గెలిచిన అభిమన్యుడు
పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు
మాంసం లేకుండా నిద్ర పోని పెద్ద పులి
గడ్డి పోసలను కొరక్క తింటుంది
వేల అర చేతుల చప్పట్ల మోతలు
రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిపోయినవి
కన్ను రెప్పలను ముద్దాడి
అలుగెల్లిపోయిన దుఃఖం
గుణపాఠం నేర్చుకున్న బతుకు
దారిమళ్లని పారుతున్న ఆశ
ఎప్పటిలాగే అస్తమించిన పొద్దు
ఉదయాన్నే మేల్కొంటుంది
ఎదిరెపల్లి
కాశన్న