లంకమల దారుల్లో.. వానజల్లుల్లో నడుద్దాం
కట్టెలు కొట్టుకురావటానికి అడివికి వెళ్లింది. కందిరీగలు దాడి చేస్తే పడిపోయింది. అమ్మను చూడటానికి వెళ్తున్న వారితో వివేక్ తను కూడా అడవిలోకొస్తానన్నప్పుడు చిన్నపిల్లాడివి వద్దన్నారు.
అమ్మ యెక్కడికి వెళ్లింది? యెప్పుడు వస్తుంది? అన్న ఆదుర్దా పిల్లలకు వుండటం సహజం.
కట్టెలు కొట్టుకురావటానికి అడివికి వెళ్లింది. కందిరీగలు దాడి చేస్తే పడిపోయింది. అమ్మను చూడటానికి వెళ్తున్న వారితో వివేక్ తను కూడా అడవిలోకొస్తానన్నప్పుడు చిన్నపిల్లాడివి వద్దన్నారు. అయిదారేళ్ల పిల్లవానికి అమ్మను గాయపరిచిన అడవిలో యేముందో చూడాలని మనసులో మెదిలిన ఆలోచనను మర్చిపోకుండా పదే పదే జ్ఞాపకం చేసుకోవటం రచయిత జన్మ రహస్యం. బాల్య కుతూహలంతో అన్వేషకులై వివేక్ ప్రపంచానికిచ్చిన కాన్క లంకమల దారుల్లో…
కొవిడ్ లాక్డౌన్ రోజులు వొక అవకాశం మాత్రమే. స్నేహితులు కూడిరావటం వొక సందర్భం మాత్రమే.యేముంది అడివిలో? యెప్పుడో యెవరో మనుషులు నడిచిన దారుల ఆనవాళ్లు వున్నాయి. మూసుకుపోతూన్న డొంకలున్నాయి. చీలిపోతూన్న బాటలున్నాయి. వొంటరితనాన్ని కావలించుకున్న మనుషులున్నారు. మడుగులున్నాయి. యెండిపోతున్న వాగులున్నాయి. గుహలున్నాయి. గద్దలు వాలే బండ రాళ్లున్నాయి. యెప్పుడో, యెవరో వివరించి రాయగా మనసుకు హత్తుకున్న పద చిత్రాలు, విశ్లేషణలు గుర్తుతెచ్చే చోట్లున్నాయి.
నడక వొక ప్రతీక. అమ్మను వెతుక్కుంటూ పిల్లవాడి నడక, మమకారాలను వదులుకుని బుద్ధుడు నడిచిన నడక, తండ్రి మాట కోసం అడివికి వెళ్లిన రాముడి నడక, మక్కా నుంచి మదీనాకు పైగంబర్ నడక, సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు మహాత్మాగాంధీ నడక! నడిచే మనుషులు తమ కన్నా ముందు నడిచిన మనుషుల ఆనవాళ్లు వెదికి పట్టుకుంటారు. కొత్త ఆనవాళ్లు వదులుతారు. అలా యిప్పుడీ వివేక్ లంకమల దారుల్లో అందించిన ఆనవాళ్లు అపురూపమైనవి.
లంకమల దారుల్లో వివేక్ నడవటం, ఆ దారులను ప్రేమగా హత్తుకుని మననం చేసుకోవటం, అలా మననం చేసుకున్నది మనతో పంచుకోవటం వీటికి వొక చారిత్రక భౌగోళిక సందర్భం వుంది. మనకు సమకాలీనులైన మనుషులు మన సామూహిక చరిత్రను తరచి తరచి చూసి మనకు చెప్తున్న కొత్త కథలు. యివి ముందుతరాల వాళ్లకు వూతనిస్తాయి. వాళ్లు చెప్పుకోవాలసిన కతలకు ఆధారాలను అందిస్తాయి. లంకమల దారుల్లో వొక్కో చాప్టర్ నీలిప్రవాహాలు, పిట్టల మకరంద సవ్వడులు, అడవిపువ్వుల సౌరభాన్ని పెనవేసుకున్న మౌన శిలలు, మార్మిక శ్వాసల లిపి గుహలు, ఆకలిని తీర్చే ఆత్మీయ చేతులు యిలా ఆరు రుతువుల అడవి లయ కాంతిమయ సౌందర్యం మన చూపులను ముగ్ధులను చేస్తుంది. దారుల్లో పోగుపడిన ప్లాస్టిక్‌ను చూసి వివేక్ నో ప్లాస్టిక్ లంకమల అని గొంతెత్తటం.. ఆచరణలోకి తీసుకురావటం చూస్తే ప్లాస్టిక్ లేని పరిసరాలకై నడవాలనే స్ఫూర్తినిస్తుంది.
లంకమల దారుల్లో చదువుతున్నంత సేపు యేవో కొత్త మాప్లు మనసులో యేర్పడుతుంటాయి, ఆయా ప్రాంతాలకు సంబంధించిన రూపాన్ని ఫీచర్స్‌ని చాలా వివరంగా చెప్తారు వివేక్. లక్ష్యమున్న నడక. బిభూతీ బాబు యుగళ ప్రసాద్‌లా వనదారుల భాష తెలిసిన వివేక్ తను దర్శించిందంతా అక్షరాలుగా విరబూయించారు.
నడకంటే వేసే ప్రతీ అడుగు మన లోపలకీ మనం అడుగైటమని… దారంతా పంచేంద్రియాలని విప్పార్చుకోవటమని, దారుల్లోని మనుషులకు పరిచితంగా అవ్వాలని మనకు ప్రేమగా అవగతం చేస్తుంది లంకమల దారుల్లో. తెలుగు మాట్లాడే ప్రతి జిల్లాలో యిలా నడిచిన నడుస్తున్న మనుషులందరిదీ వొకే భాష. అది చలన శీలత్వం నుంచి వచ్చిన భాష. మనలోని చదువరి దాహం వారంతా వారివారి నడకని రాస్తే బాగుండుననుకొంటుంది వివేక్ బాహ్య ఆంతరంగిక భావుక సమ్మిళిత నడక లంకమల దారుల్లోకి చదివాక.
– కుప్పిలి పద్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

