కోయిల గళం – కాకి బలగం
కోటి గళాల కలాపాలు భిన్నస్వరాల వేనవేల సుస్వరాగాలు అధికారమధిష్టించే ఆరాటంలో జనాల్ని వెర్రెత్తించే ప్రసంగాల ప్రలోభాలు దశాబ్దాలు ప్రజల్ని కన్నెత్తిచూడని నిర్లిప్తనాయకత్వం నేడు ప్రత్యక్షమై వల్లిస్తున్న ప్రబోధం ‘నాకోసం కాదు - మీకోసం’
కోటి గళాల కలాపాలు
భిన్నస్వరాల వేనవేల సుస్వరాగాలు
అధికారమధిష్టించే ఆరాటంలో
జనాల్ని వెర్రెత్తించే ప్రసంగాల ప్రలోభాలు
దశాబ్దాలు ప్రజల్ని కన్నెత్తిచూడని నిర్లిప్తనాయకత్వం
నేడు ప్రత్యక్షమై వల్లిస్తున్న ప్రబోధం
‘నాకోసం కాదు – మీకోసం’
ఎన్నికల్లోనే స్ఫురించిన జీవన వేదం
సంక్షేమ జపమాల ధరించే రాజకీయం
ఒళ్లంతా పాకిన అధికార లాలసత ఈనాడు
తామసం కమ్ముకున్న మనోదౌర్భల్యం
సత్యాలను పాతరేసే చిత్రహింసలు
రాజ్యకాంక్ష రావణ కాష్టానికి రహదారి
అదే నేడు రాజ్యాధికార కౌటిల్యం
అగ్గిలా అలముకొన్న రాజకీయ మాలిన్యం
కటిక చీకట్లో పలవరించే దీన జనాలు
సిద్ధాంత కలిమి ఉద్ధరించని భావి జీవితాలు
దూరదృష్టి కరువైన దశాబ్దాల రాజ్యాధికారం
ఎన్నికలు ఓటరు విజ్ఞతకు విషమ పరీక్షా సమయం
దుష్ప్రచారాన్ని ఛేదించే బ్రహ్మాస్త్రం
లక్షల ఎకరాల ధాన్యాగారాల వరప్రదాయిని
‘కాళేశ్వరం’ కాలకూట విషమా?
సమగ్ర ప్రజాసంక్షేమం
కబోదుల కళ్ళకు కనుమరుగైందా?
గోబెల్స్‌ను తలదన్నే అభూత కల్పనలు
కాలాతీతంగా నిలిచే నవ్య ఆలోచనాధారలు
కోటిదివ్వెల్ని వెలిగించే క్రాంతిరేఖలు
కాకి బలగం పేల్చే మారణాస్త్రం
అది కోకిలగళం సంధించే దివ్యాస్త్రంచే నిస్ర్తాణం.
-కె. లక్ష్మణ్ గౌడ్
97049 30509
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
- Tags
- literature
- NT Kavithalu
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

