కీచు శబ్దాల విక్స్ గొంతులు..
ఆముదం తాగిన అక్షరాయుధాలు..
అన్నీ వొదిలేసిన ఆంధ్రా బాణాలు..
హక్కులు దోలాడుతున్న దోపిడీ వారసులు..
బాధ్యతలను వదిలేస్తున్న బానిస మనస్తత్వాలు..
గాయి గాయి ఐతున్న గాయాల తనువులు..
గాలివాటానికి తలొగ్గిన బతుకు తెరువులు..
సోయి తప్పిన మేధావితనాలు..
మందెంటపోయే ఇంటి పగలు..
మర్లి సూస్కోరాని మూర్ఖత్వాలు..
దీక్షా దివస్ సాక్షిగా అంటుకుంటున్న అగ్గి రవ్వలు..
మల్లా ఎరుపెక్కుతున్న గులాబీ పూలు..
-సహస్ర