కృతజ్ఞతలు
ప్రచారం నీకంటే ఎత్తుగా ఉండకూడదు పని నీకంటే పొట్టిగా ఉండకూడదు బాకాలు డప్పులు చుట్టూ ఉన్న జనాలకు వినోదాన్నిస్తాయి
ప్రచారం
నీకంటే ఎత్తుగా ఉండకూడదు
పని
నీకంటే పొట్టిగా ఉండకూడదు
బాకాలు డప్పులు
చుట్టూ ఉన్న జనాలకు వినోదాన్నిస్తాయి
చప్పట్లు ఈలలు
నిన్ను నీకు
తెలియకుండా చేస్తాయి
పరదా మీద ఎంత
పెద్ద దీపం బొమ్మ గీసినా
అడుగుల మీద వెల్తురు పడదు
మునిలా
నీ పని నీవు చేసుకుంటూ వెళ్లు
తుఫాను నీ పక్కనుంచే
నిశ్వబ్దంగా సలాం చేస్తూ వెళ్తుంది
(ఈ పోయెం రాయించిన జమాల్ పాషా నాతో గల్లీల్లో ఆడుకున్న బాల్యమిత్రుడు)
– ఆశారాజు
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

