అయ్యా.. ఓ పారి అచ్చిపోరా!
అయ్యా.... మీరొత్తండ్లని కబురందగానే మీ వొళ్ళలువకుండా ఉండేందుకు మావోళ్ళు తెల్లారి తెల్లార్లకే రోడ్లు సగపెట్టిండ్రు మీ కళ్ళకానందంగా నదురియ్యడానికి ఒక్క పూటల్నే చెట్లను పెంచిండ్రు మీరు మొక్కుకునే గుడి సుట్టూత ఎలిగే కరెంటు దీపాల జిలుగులు సూత్తాంటే నింగి నుండో సుక్కల మండెను దెచ్చి ఈడ అలికినట్టుండ్రు తొవ్వ తొవ్వంతా శెత్తను దీశి ముగ్గులు పోశిండ్రు మీ పాణానికి ఎప్పుడు ఏ ఆపద యెట్లత్తదోనని పెద్దాసుపత్రిల జేశినట్టే సకలం సవులతులు జేశిండ్రు
అయ్యా….
మీరొత్తండ్లని కబురందగానే
మీ వొళ్ళలువకుండా ఉండేందుకు
మావోళ్ళు తెల్లారి తెల్లార్లకే రోడ్లు సగపెట్టిండ్రు
మీ కళ్ళకానందంగా నదురియ్యడానికి
ఒక్క పూటల్నే చెట్లను పెంచిండ్రు
మీరు మొక్కుకునే గుడి సుట్టూత
ఎలిగే కరెంటు దీపాల జిలుగులు సూత్తాంటే
నింగి నుండో సుక్కల మండెను దెచ్చి ఈడ అలికినట్టుండ్రు
తొవ్వ తొవ్వంతా శెత్తను దీశి ముగ్గులు పోశిండ్రు
మీ పాణానికి ఎప్పుడు ఏ ఆపద యెట్లత్తదోనని
పెద్దాసుపత్రిల జేశినట్టే సకలం సవులతులు జేశిండ్రు
గియన్ని ఆర్తల్లో ఇని జూశినంకా మాకాశబుట్టింది
అయ్యా… మీకు పున్నెముంటది బాంచన్
ఓ పారి మా గూడానికొచ్చిపోరాదుర్రి
గిట్లనన్నా…
మూరెడు మూరెడు గుంతలు పడి
బురద మైళ్లెన మా రోడ్లు సక్కపడుతయేమో
మా ఇంట్లబుట్టినోళ్ళ లెక్కనే మమ్మంటుకునుండే మురుగు
కొన్ని దినాలన్నా మా నుంచి దూరమైతదేమో
యెన్నడెలుగని మా గూడెంలో ఈది దీపాలు
మీరొచ్చే పున్నాన తళుకు తళుకులాడుతాయేమో
కక్కుడేరుగుల్లకే మందుబిళ్ళల్లేక సచ్చిన మా సంటోల్లు
మీ పేరు మీదనన్నా నాలుగొద్దులెక్కువ బతుకుతరేమో
అయ్యా… మీరొత్తే మా గూడెంల
దసరా దీపాలి కలిపొచ్చినట్టే ఉంటది
మీకు పున్నెముంటది..
యాడాదికోపారన్నా మా గూడాలకొచ్చిపోండ్రి
ఎప్పుడు యే గాలికారిపోతయో తెల్వని
మా బతుకు దీపాంతలల్లా
మీ తీరుబడి యాత్రైనా…
మాకింత జీవ సమురైతదేమో….
మీకు పున్నెముంటది
అప్పుడప్పుడూ మా గూడాలపొంటి సూశిపోండ్రి బాంచెన్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

