తాను- నేను
నేను ప్రేమను పంచాను, తను తన మౌనాన్ని పంచింది. నా హృదయాన్ని స్నేహమయంగా విప్పాను, తను తన తలుపులు మూసుకుంది.
నేను ప్రేమను పంచాను,
తను తన మౌనాన్ని పంచింది.
నా హృదయాన్ని
స్నేహమయంగా విప్పాను,
తను తన తలుపులు మూసుకుంది.
నేను స్వప్నాలకు రెక్కలు ఇచ్చాను,
తను వాటిని మట్టిలో కలిపింది.
నా ఆశలు లతల్లా ఎదిగాయి,
తన ఒంటరితనంతో వాటిని కత్తిరించింది.
నేను దారిని తారుగా చూపాను,
తను పొగమంచులో కలిసిపోయింది.
నా మాటలతో ప్రేమ గాథల్ని లిఖించాను,
తను తన మౌనంతో సమాధుల్ని కట్టింది.
నేను వెలుగుని వెతికాను,
తను నిశీధిని ఒప్పుకుంది.
నా కన్నీటిని సముద్రం చేసింది,
తను చల్లదనంతో కాలువలా సాగింది.
ప్రేమను పంచిన నా మనసు,
ఇప్పటికీ ఆశగా ఎదురుచూస్తుంది,
ఆమె తన మౌనంలో లీనమై,
గతాన్ని జ్ఞాపకాల్లో చెరుగుతోంది.
బాలాజీ పోతుల
81792 83830
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

