చేదు గురుతులు
మా అవ్వ వాకిట్లోకి వంటింట్లోకి
మా అవ్వ
వాకిట్లోకి వంటింట్లోకి
గిరగిరా తిరుగుతున్నపుడు
అవ్వ కాళ్ళకు నేలకు మధ్యన
పాదరసమేమన్నా పారుతుందేమోనని వెతికిన నాకు
కొయ్యకాళ్ళ ఒరుపులకు మడమలెంట
సన్నగా కారుతున్న రక్తం మరకలు కండ్లబడ్డయి
అవ్వా…
ఆకలైతందే అన్నప్పుడు
చప్పున కడుపులోకేదన్న ఇచ్చే అవ్వ చేతిలో
మంత్రదండమేదన్నా దాసిందేమోనని వెతికిన నాకు
వంటిల్లు మంటలకు, కలుపు కొయ్యల కోతలకు
అరసేతిలో పల్లెరుగాయలసొంటి
బొడిపెలు కండ్లబడ్డయి!
అవ్వా…
పరీచ్చలకు పైసలియ్యే అన్న ప్రతిసారీ
కొంగు కొసల ముడులిప్పే అవ్వ కొంగుల
గల్లగురిగేమన్నా దాసిందేమోనని వెతికిన నాకు
శీకిపోయిన శీరకు జల్లడసొంటి బొక్కలు
కండ్లబడ్డయి!
అవ్వా…
నౌకరొచ్చిందే అని ఉరికిపోయి చెప్పినపుడు
కోటి దీపాలోలే ఎలిగిన అవ్వ కండ్లల్లో
ఏ నూనె పోసిందోనని వెతికిన నాకు
బిగవట్టి ఆపుకున్న కన్నీళ్లు కండ్లబడ్డయి..!
వి.దిలీప్
84640 30808
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
Nara Lokesh | ‘జై బాలయ్య’ అంటూ నారా లోకేష్ సందడి.. జగపతిబాబు షోలో బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

