ఒక చెట్టు.. 33 పువ్వులు

ఇంద్రధనుస్సు విరబూసిన సంబురం
కొమ్మలన్నీ చిగురు పెదాలై
నవ్వుతున్న నిత్య వసంతం!
ఆశ్రితులు గూళ్ళు కడుతూ
ఎవరి పనుల్లో వాళ్ళు
తలమునకలవుతుంటే
గొడుగు నీడయిన చెట్టు
దీపాన్ని కాపుగాసే అరచేయంత అడ్డుగోడ!
ఆ తాత నాటిన విత్తనం
అప్పుడే ఫలాలిస్తున్నది
నిన్నటి మొక్క ఇవ్వాళ పూవయింది!
నిజమే ఎవరన్నారో గానీ..
పచ్చని చెట్టు ప్రగతి కలల మెట్టు
ఏ ఎడారి తీరానికో వలసబోయిన పిట్టరెక్క
మాయిముంత జాడ దొరకబట్టి
గూడు చేరిన గూటి పాట!
ఏ కొమ్మకయినా
చిగురు పూయించు సారం ఈ నేలది
కట్టెలమ్మిన చోట
పూలమ్ము అదృష్టం ఈ మట్టిది
ఈ చెట్టు ముప్పెమూడు పువ్వుల
నిత్య పున్నమి..!
గజ్జెల రామకృష్ణ
8977412795
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

