మిరుగు – మెరుపు

అవ్వ ఇంగు బెల్లాన్ని వాడకట్టంతా పంచింది
అందరి నోరు తియ్య తియ్యన
దూరం నుంచి వాన చిన్కులు
పిల్లల నాల్కపై రాలి ఇంకా తియ్యన!
మిరుగు వచ్చిందంటే ఎక్కడా ఆగకుండా
ఆగమాగంగా వాన మబ్బులు రావాల్సిందే
ఎక్కడా చిన్కు తెగదు
ఏకధార ఏకధార.. ఏకధార!
సందడి సందడి
వాన సందడి
ఇగ రైతుకు తీరికేది
తిన పురస్తు దొరకదు
అందరికీ తినిపించుడే తెలుసు!
నాగలి నడక పరుగౌతుంది
గింజలపై పడ్డ చినుకు మొలకై పోకడ పోతుంది
లోక కళ్యాణం అంటే
ఆగకుండా ఆవురావురుమని వానలు పడుడే!
మిరుగు నాడు వాన పడ్డాకా
కాలం మహా మంచిగుంటదని
పెద్దలు మొగులుకు మొక్కి చెపుతరు
ఎక్కడా ఆకలి పత్తా ఉండదు!
ఇగ అన్నపూర్ణ గుడిలోనే కాదు
అందరి ఇంట్లోనూ కొలువై ఉంటుంది
ఇంట్ల ప్రతి బగోను అక్షయ పాత్రే!!
కందాళై రాఘవాచార్య 8790593638
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

