మంచిని పంచడమే మనిషి ధర్మం
చన్దనం శీతలం లోకే
చందనాదపి చంద్రమా
చంద్రచన్దనయోర్మధ్యే
శీతలా సాధుసంగతః॥

లోకంలో మంచి గంధం చల్లదనాన్ని కలుగజేస్తుంది. చందనం కంటే కూడా చంద్రుడు హాయిని కలుగజేస్తాడు. ఈ రెండింటి కంటే సజ్జనుల సాంగత్యం మరింత ఎక్కువ చల్లదనాన్ని కలుగజేస్తుంది. సజ్జనుల చల్లదనం అంటే.. సాటి మనుషులకు దుఃఖం కలుగజేయకుండా సంతోషాలను పంచటంగా భావించాలి. సమాజంలో సజ్జనుడు ఎల్లప్పుడూ మంచినే పంచుతూ, మంచికోసమే తపిస్తూ పరుల హితం కోసమే ఆలోచిస్తాడు. మంచి పనులే చేస్తాడు. ఎదుటి మనుషులకు హాని తలపెట్టి దుఃఖం కలుగచేయని అతను తోటివారికి చల్లదనాన్ని పంచుతున్నట్లే కదా! అందుకే అందరూ మంచినే ఆచరించాలి, మంచికోసమే జీవించాలి.
టి.సుధాకరశర్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

