అల్కువిడుస
పొద్దున్నే లేచిన మా అమ్మ పాత కుండల పటికె బెల్లమేశి దాశిపెట్టినట్టు నల్లటి కూరట్కెల నాలుగు ఎర్ర మన్ను పెల్లలేశి లోటెడు లీల్లు వోశి గంటసేపు ఇంటి ఇడుపున గడుపుమంటూ నానవెడ్తుండె
పొద్దున్నే లేచిన మా అమ్మ పాత కుండల
పటికె బెల్లమేశి దాశిపెట్టినట్టు
నల్లటి కూరట్కెల
నాలుగు ఎర్ర మన్ను పెల్లలేశి
లోటెడు లీల్లు వోశి
గంటసేపు ఇంటి ఇడుపున
గడుపుమంటూ నానవెడ్తుండె
వొంట పనైనంక మల్ల ఆమెనేవొయ్యి
దూరంగొట్న పోరగాన్ని
దెగ్గర్కి దీస్కున్నట్టు
అటికె మీద ఐదేళ్ళేశి గుంజుకోని
ఇల్లంతా ఆవు పంచితం చల్లినట్టు
మంగళార్తి మనుషులందర్కి జూపెట్టినట్టు
అందంగా అల్కువూత చేస్తుండె
అదంతా ఆరకముందే
దేవుని ఇగ్రాన్ని పూవుల్తో పూదిచ్చినట్టు
ఇల్లంతా ముగ్గుల్వెట్టి లెస మురుస్తుండె
ఇంటిడుపులు జూసి
ఇల్లాలిని చెప్పొచ్చంటే
ఇదేమిడ్దిది అనుకున్న గాని
ఇల్లు గురించి మా అమ్మ జేసే
ఇగురం జూస్తే నిజమే అన్పిచ్చింది
సంటిపోరన్లెక్క ఇల్లంత దోగ్యాడి
ఇంట్లో అందం ఇర్గవూయించినా
అమ్మ అర్శేతికి గోరింట వెడ్తెనే
అసలైన ఆనందం నాకని
ఆరానికొక్కసారి అల్కువిడుస
ఆమె శెయ్యినందుకోనీకె
ఇగలేని ఆరాటపడ్తుండె
ఒచ్చిపొయ్యెటోల్లు ఒద్దిస్తె బాగుండదని
ఒయ్యారం ఒలుకవోసేటట్టు
ఇడుపుల మీద ఇంతశేపు
ఒడుపుగా నడుస్తుండె
అల్కువిడుసంటే అందినకాడికి
ఎర్రమన్ను నీల్లుదాగి
ఇంటి బయట మూలకు
ఇడుపులపోంటి కూసోని
ఇగలవట్టేది కాదు
ఇంటికీ ఇల్లాలికీ పేరుదెచ్చేది
అల్కువిడుసంటే
పనికిరాని బట్టపేగును
పనిలో పెట్టించనీకె
పాకులాడే రకం కాదు
ఇంతి పాదాలకు పసుపు లెక్క
గదువలకు గంధం లెక్క
ఇంటికి… అందాన్ని సలువను
అపురూపంగా అద్దేది
– కమలేశ్ 91603 96596
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి చికిత్స చేయించుకున్న మహిళ.. ప్రాణాలను కాపాడుకోవడంలో కీలకం..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

