జీవిత వెలుగులు
దీపావళి తెల్లారి దిన పత్రిక రాలేదు ఉదయం ఊరికే కదలదు కదా వాకిట్లోని అక్షరాలను చదువుతున్నా తమిళ తంబీలు నవ్వుతున్నారు నన్ను చూసి
దీపావళి తెల్లారి రాలేదు
ఉదయం ఊరికే కదలదు కదా
వాకిట్లోని అక్షరాలను చదువుతున్నా
తమిళ తంబీలు నవ్వుతున్నారు నన్ను చూసి
వీధి నిండా
పిల్లల కేరింతలు పరుచుకున్నాయి
గాలి వచ్చి దాడి చేయక ముందే
నాలుగు ఫొటోలు తీసి
నిన్నటి ఉత్సాహన్ని వాట్సాప్ చేయాలి
అమ్మ లేచి ఊడవక ముందే
కాలని బాంబులు కొన్ని
కుప్పలు పోసి మంట పెట్టి
పిల్ల దీపావళి జరుపుకునేటోళ్ళం
బాల్యం అంటే భేషజం లేని జ్ఞాపకాలే
కాల్చిన చేతులు మసి బారితే
దేశమంతా చిచ్చుబుడ్లు నింగిలో
అక్కడి బాల్యం కరిగి కాలి
ఇక్కడ వాకిలి విర బూసింది
త్యాగాలు లేకుండా తళుక్కులు ఎక్కడివి
కాసిన్ని పటాసులు కాల్వకుంటే
కార్మికుల కడుపులు నిండేదెలా
ఆకాశం కొంత కోపగించినా
డబ్బులు వృధా కాలేదు
ఒక్క అమావాస్య ఎన్నో జీవితాలకు వెలుగులు
– దాసరి మోహన్ 9985309080
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

