నచ్చవు గాని
మెత్తగా గుచ్చినా
భలే ఇష్టం నీవంటే….
అమాంతం నిజంలోకి దూకి
ఆ ధూళిలోనే ఒడిసిన కలను
ఓర్పునల్లి , నీడను చల్లి
విస్తృతంగా వీచే ఎండను తాగి
ఎర్రని కిరాణాలను కౌగిట్లో ఆర్పి
మేఘమై కరగడంలో
తడవడం సరదా
తేమవడం సందడి
అందులో నేను మొలవడం
ఓ తమాషా..
– శ్రీ సాహితి 9704437247