చివురు నవ్వు
కొండపయి తెప్పలా నీటి గోలాలను కొంగ కోటి గుంపు కిందికొంపినట్టు పూసిన అడవిలో పుప్పొడంతా ఎగిసి కాసిన ఎన్నెలకు గంధమద్దినట్టు ఎగిసి దుంకె ఎత్తిపోతల అందం కాంచనీకె రెండు కళ్లు జాలవు నిజం
నింగి చూరులోని సుక్కలన్ని కారి
నేల దారిలోన నీటి పూలయి జారి
వరద పొంగు నీరు వలికి నవ్విన ఏరు
ఎత్తిపోతల ఏటి తాళమేసింది
తెరగాలి నావల తేలియాడింది
పాలమూరును తాకి పరవశించింది
కొండపయి తెప్పలా నీటి గోలాలను
కొంగ కోటి గుంపు కిందికొంపినట్టు
పూసిన అడవిలో పుప్పొడంతా ఎగిసి
కాసిన ఎన్నెలకు గంధమద్దినట్టు
ఎగిసి దుంకె ఎత్తిపోతల అందం
కాంచనీకె రెండు కళ్లు జాలవు నిజం
శ్రీశైల భ్రమరాంబ శివుని అభిషేకించి
శ్రీగిరిలో భగవాను బుద్ధుని సేవించి
విరజా నది చంద్రవంకలెంబడి సాగి
ఇంద్రకీలాద్రికి విసురు గాలుల నేగె
పడమటికి మళ్ళిందిరా కృష్ణమ్మ
పరిగి వైపు కదిలెర కృష్ణమ్మ
నాచు పేరిన రాళ్లు మెత్తనయి పోతాయి
సెట్ల పాదులకాడ సెలిమలూరుతాయి
తీరాన తీతువ గుడ్లు పొదుగుతాది
తాబేళ్లు దరిబావి నీళ్ల్లు కదలాడుతవి
లోగిలి కొట్టాల పిచ్చుకలు చేరుతాయి
యాగిలి కళ్లాల రాసులు ఊరుతయి

లేతాకు రేకల పడవలల్లుకొని
ఊరూర పిల్లలు కేరింతలాడేరు
వాగుళ్ల వంపుళ్ల సెరువుల్ల సేపలు
వలతోని తిరుగాడె జాలరుల కేకలు
ఇసుక పిట్ట గూళ్ల ఇండ్లు కట్టుకొని
పసితనం యాదిలో పల్లె మైమరిసేను
గడ్డికోసే వేళ జొన్న వెన్నుకు తాకి
వాడు వట్టిన కంకి జీవమొలికినట్టు
ఆరుతడి పంటల పెదవి దప్పికారి
పాలిపోయిన సెనగ పూత వట్టినట్టు
పాల నురగల ఏరు పాలమూరుకు కదల
తల్లి పొదుగును తాగి పల్లె లేగయ్యింది
నీరు పల్లము దిక్కు పారు నిజమే కానీ
పట్టుదల మనకుంటె ఎటకయిన పారునని
ఎత్తయిన మాగూరు కొందూరుకు మలిపి
రానన్న రాకమాచర్లకె రప్పించి
పరిగి కొడంగల్లు పంట దుక్కుల తడుప
పరుగెత్తే ఏటికి ఊరులు పబ్బతి పట్టె
మక్క పెరటి కంకి తనువింక మండదు
పొద్దు తిరుగుడు పువ్వు పెదవింక ఎండదు
మిరపనారుకు నీటి మురిపెమె తీరును
దోస తీగల పెరటి దోసిలె నిండును
ఆరుతడి కాతలకు సాలినంత నీరు
పారించిన దాత ఈ నేల తొలినేత
అతనేమిటో ఎవనికర్థమవడు నిజమే
అలుపెరుగని తపన అంతరంగంలోన
నేల లిపినెరిగిన నేటి బలరాముండు
మహిమ ఏమున్నదో మట్టి బంగారమవును
తను తాకితె చాలు బండ నీరయి ఊరు
చూపు సోకితె సాలు మోడు చివురయి నవ్వు
– గోరటి వెంకన్న
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

