కలవరమాయే..
మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీ వివరణలోనే కొంత పశ్చాత్తాపం కనిపిస్తున్నది. మీ ఆయన ప్రాణ స్నేహితుడంటూ ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ప్రాణస్నేహితులెవరూ ఈ తరహా చనువు తీసుకోరు. ఇదంతా కేవలం ఆకర్షణే.
నాకు మూడేండ్ల క్రితం పెండ్లయింది. మా వారు వ్యాపారవేత్త. ఇంకా పిల్లలు లేరు. ఆయన బిజినెస్ పనుల మీద తరచూ టూర్స్ వెళ్తుంటారు. నెలకు ఇరవై రోజులు ఇంట్లోనే ఉండరు. మిగతా పది రోజులు కూడా బిజీబిజీ. మా ఆయన ప్రాణ స్నేహితుడు తరచూ మా ఇంటికి వస్తుంటాడు. బయటి పనుల్లో సాయం చేస్తుంటాడు. ఒంటరితనాన్ని భరించలేక తనతో ఫోన్లో మాట్లాడుతుంటాను. అప్పుడప్పుడూ ఏ రెస్టారెంట్‌కో తీసుకెళ్తాడు.
అల్లరి చేస్తాడు. తెగ నవ్విస్తాడు. ప్రత్యేక సందర్భాల్లో కానుకలూ ఇస్తుంటాడు. దీంతో కొంత సామీప్యం పెరిగింది. ఈ విషయాలేవీ మా ఆయనకు తెలియవు. మావారు ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం నన్ను ‘బాబీ.. బాబీ’ అని పిలుస్తుంటాడు. ఆ నటన చూసి నవ్వు ఆపుకోలేక పోతాను. అతనితో పడక పంచుకున్నట్టు ఈమధ్య కల వచ్చింది. అప్పటి నుంచీ చాలా ఆందోళనగా అనిపిస్తున్నది. నేను చేస్తున్నది తప్పా? అతణ్ని దూరం పెట్టాలా?
- ఓ పాఠకురాలు
మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. మీ వివరణలోనే కొంత పశ్చాత్తాపం కనిపిస్తున్నది. మీ ఆయన ప్రాణ స్నేహితుడంటూ ఆ వ్యక్తిని పరిచయం చేస్తున్నారు. ప్రాణస్నేహితులెవరూ ఈ తరహా చనువు తీసుకోరు. ఇదంతా కేవలం ఆకర్షణే. ఖాళీ బుర్ర దయ్యాల కార్ఖానా అంటారు. ఏ పనీ లేకపోవడం, ఏ బాధ్యతా తీసుకోకపోవడం వల్ల మీ ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి. మీ ఒంటరితనమే మీ శత్రువుగా మారుతున్నది. మీరు ఉంటున్న ఖరీదైన ఫ్లాట్, మీరు ధరిస్తున్న బ్రాండెడ్ దుస్తులు, మీరు షికారుకు తీసుకెళ్లే కారు.. అన్నీ మీ ఆయన కష్టార్జితమే. మీ భర్త గురించి మీరు ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. అంటే, మంచివాడనే కదా అర్థం. ఆ మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. మీకు, మీ వారికి మధ్య చిన్నపాటి అగాథం ఏర్పడిన మాట నిజమే. దాన్ని సరిచేసుకోండి.
ఈ విషయంలో మీరు ఇంకొంత చొరవ చూపండి. అతను ఇంట్లో ఉన్నప్పుడు.. మనసు విప్పి మాట్లాడండి. టూర్లో ఉన్నప్పుడు.. ఫోన్ చేసి పలకరించండి. ‘మీరు దూరంగా ఉన్నా సరే.. నా మనసుకు మాత్రం దగ్గరలోనే ఉన్నారు’ అనే భావన కలిగించండి. మీ బంధం తప్పక బలపడుతుంది. ఆ పిచ్చి కల గురించి ఆందోళన చెందాల్సిన పన్లేదు. మనసులో ఏ మూలనో ఉన్న ఆలోచనకు అదో దృశ్యరూపం. బుర్రలోంచి తుడి చేయండి. ఆ వ్యక్తి మీ వారి ముందే కాదు, మీ ముందు కూడా నటిస్తున్నాడేమో? జాగ్రత్త.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

