పిడికెడు నడుముకు గంపెడు కష్టాలు అంటే ఇదే కావచ్చు. ముచ్చటపడి కొన్న వడ్డాణం జారిపోతుంది. ప్రేమగా చుట్టుకున్న పట్టుచీర కుచ్చిళ్లు కుదురుగా ఉండనంటాయి. నచ్చినవాడి వేళ్లు.. దొంగచాటుగా దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తాయి.
చి.ల.సౌ. సుకుమారిని ఈ ఇష్టమైన కష్టం నుంచి గట్టెక్కించాలంటే ఒకటే మార్గం.. నాగబంధం విధించాలి! నిధి నిక్షేపాలకు సర్పాలను కాపలా పెట్టినట్టు.. ఆమె నాభి చుట్టూ పలుచని నాగాభరణాన్ని పహరాగా మోహరించాలి.