కార్టిసాల్ హార్మోన్: పగలు మనల్ని యాక్టివ్‌గా ఉంచే కార్టిసాల్ హార్మోన్ రాత్రికి తగ్గిపోతుంది. అది తగ్గితే మనలోని భయాలు, బాధలు బయటికి వస్తాయి. అందుకే చిన్న సమస్య కూడా రాత్రి పెద్దగా కనిపిస్తుంది.
భవిష్యత్ భయం: రేపు ఆఫీస్‌లో ఏం జరుగుతుందో? జీతం వస్తుందా? భవిష్యత్ ఎలా ఉండబోతుంది? లాంటి ఆలోచనలు రాత్రి సమయాల్లోనే ఎక్కువగా వస్తాయి. దీంతో మన కంట్రోల్లో ఏదీ ఉండదని భయం వేస్తుంటుంది.
పగటి ఫీలింగ్స్: పగలు ఏడవకూడదు, కోపం చూపించకూడదు అని మన ఫీలింగ్స్‌ను లోపలే దాచేస్తాం. రాత్రి అందరూ నిద్రపోయాక ఎంత వద్దనుకున్నా అవే ఫీలింగ్స్ బయటికి వస్తాయి. అందుకే రాత్రి బాధ, ఏడుపు ఎక్కువ వస్తుంది.
ఫోన్ లైట్: రాత్రిపూట ఫోన్ చూస్తూ కూర్చొంటే బ్రెయిన్ నిద్రలోకి వెళ్లదు. ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుంచి వెలువడే బ్లూలైట్ వల్ల మెలటోనిన్ (నిద్ర హార్మోన్) తగ్గిపోయి నిద్ర సరిగ్గా పట్టదు. దీంతో కూడా అనవసర ఆలోచనలు వస్తాయి.
మీలోనూ: మీరు ఓవర్థింకరో కాదో తెలుసుకోవడానికి ఇలా చేయండి. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం, చిన్న విషయాన్ని పెద్దగా ఊహించుకోవడం, నిద్రపోయే ముందు గతాన్ని తవ్వుకోవడం ఇలాంటివి మీలో కనిపిస్తే మీరు కూడా ఓవర్‌థింకర్ అని అర్థం.
ఇలా చేయండి: రాత్రిపూట ఓవర్‌థింకింగ్ తగ్గాలంటే కొన్ని టిప్స్ పాటించడం తప్పనిసరి. అందులో భాగంగా రాత్రి 11 గంటలలోపు పడుకోండి. పగటిపూట ఆలోచనలు ఒక నోట్లో రాసుకోవడం, పడుకునే ముందు పది నిమిషాలు ఏదైనా పుస్తకం చదవడం చేయండి. దీనివల్ల ఆలోచనలు తగ్గుముఖం పట్టి మంచి నిద్ర పడుతుంది.