భార్యాభర్తల మధ్య బంధం బలపడి.. ఆనందంగా ఉండాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
ఆలుమగలు తామిద్దరూ ఒకటే అనుకున్నప్పుడు సంసారం అనే చదరంగం ఒంటెత్తు పోకడతో కాకుండా.. రంజుగా సాగుతుంది. అందుకు కావాల్సింది భార్యాభర్తల మధ్య అపరిమితమైన నమ్మకం. తాళి కట్టు శుభవేళ.. కలిగే ఆనందాన్ని రోజూ గుర్తుచేసుకుంటే, ప్రతిరోజూ ప్రణయ సీమలో విహరించొచ్చు.
ఆలుమగలు తామిద్దరూ ఒకటే అనుకున్నప్పుడు సంసారం అనే చదరంగం ఒంటెత్తు పోకడతో కాకుండా.. రంజుగా సాగుతుంది. అందుకు కావాల్సింది భార్యాభర్తల మధ్య అపరిమితమైన నమ్మకం. తాళి కట్టు శుభవేళ.. కలిగే ఆనందాన్ని రోజూ గుర్తుచేసుకుంటే, ప్రతిరోజూ ప్రణయ సీమలో విహరించొచ్చు. తలంబ్రాలప్పుడు పోటాపోటీగా తలపడినా ఆనందంగా ఆస్వాదించిన వైనాన్ని తలుచుకుంటే.. ఆల్ హ్యాపీస్! ఏడడుగులతో మొదలయ్యే సంసార యానంలో అపనమ్మకం పొడచూపకూడదంటే ఈ టిప్స్ పాటించండి..
పార్ట్నర్ని లైక్ చేయండి: సోషల్ మీడియా అందరి జీవితాల్లో భాగమైంది. ఒంటరి పక్షిగా ఉన్నప్పుడు గంటల తరబడి సామాజిక మాధ్యమాల్లో విహరించినా ఒప్పే కానీ, జంటపక్షులై ఓ గూటికి చేరాక కూడా అలాగే ఉంటానంటే కుదరదు. పొద్దస్తమానం ఫోన్లో తలదూర్చడం, అనవసరమైన చర్చల్లో తలమునకలు కావడం కలహాలకు దారితీస్తుంది. భాగస్వామి కన్నా లైక్ చేసే కంటెంట్ ఏముంటుంది చెప్పండి! పార్ట్నర్తో షేర్ చేసుకోవాల్సిన ముచ్చట్ల కన్నా ట్యాప్ చేసే సంగతులు సోషల్ మీడియాలో మచ్చుకైనా కనిపిస్తాయా? అందుకే సోషల్ మీడియాకు కాస్త దూరం పాటించండి.
ఇగోల గోల వద్దు: నేను, నా ఉద్యోగం ఇవన్నీ బయటి లక్ష్యాలు. ఇంటికి వచ్చాక మనం, మన భవిష్యత్తు అన్న తలంపే ఉండాలి. ‘నాది ఉన్నతోద్యోగం, పైగా ఎక్కువసంపాదన’ అన్న ఇగోకు పోతే.. గోల మొదలవుతుంది. అది కాస్తా నాలుగు గోడలు దాటి వీధికెక్కుతుంది. ఒకరి గెలుపును మరొకరు ఆస్వాదిస్తే… ఉభయులూ విజయం సాధించొచ్చు.
చెరిసగం: ఆలుమగలు సమానం అనే ఆలోచన ఉంటే.. ఆ కాపురం అనురాగ గోపురంగా మారుతుంది. ఏ విషయంలోనూ ఒకరు తక్కువ, ఎక్కువ కాదు! ఆ మాటకొస్తే తామిద్దరం కాదు.. ఒక్కరమే అన్న భావన పెంపొందించుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

