రామ్మా చిలుకమ్మా..
చిలుక పలుకులు, అతివ కులుకులు.. దేనికదే ముచ్చటగా ఉంటాయి. ఆ చిలుకమ్మ అందాలను కలికి ఆభరణాలుగా మారుస్తున్నారు నేటి డిజైనర్లు. అందుకు తగ్గట్టు అమ్మాయిలు కూడా.. రామ్మా చిలుకమ్మా అంటూ ఆ నగల పట్ల ప్రేమ మొలకల్ని మొలిపిస్తున్నారు.
చిలుక పలుకులు, అతివ కులుకులు.. దేనికదే ముచ్చటగా ఉంటాయి. ఆ చిలుకమ్మ అందాలను కలికి ఆభరణాలుగా మారుస్తున్నారు నేటి డిజైనర్లు. అందుకు తగ్గట్టు అమ్మాయిలు కూడా.. రామ్మా చిలుకమ్మా అంటూ ఆ నగల పట్ల ప్రేమ మొలకల్ని మొలిపిస్తున్నారు. అంతేకాదు, చిటారుకొమ్మన గుసగుసలాడే గువ్వల జంటలు, చిగురుటాకుల మీద సందడి చేసే చిట్టిపిట్టలు.. ఇప్పుడు సొమ్ముల్లో అమరిపోతున్నాయి. ‘బర్డ్ ఇన్స్పైర్డ్ జువెలరీ’ రామచిలుకంత రమ్యంగా అగుపిస్తున్నాయి.

చిలుక జోస్యం.. రేపటిని తెలిపే ఓ నమ్మిక. చిలుక కొరికిన జాంపండు.. ఇష్టమైన వారికి తియ్యని కానుక. ఇక, చిలుకమ్మ నగలు కలికి చిలుకల కొలికికి అందమైన జోడీ. అతివ ముస్తాబులో ఇన్నాళ్లూ అగ్రతాంబూలం అందుకున్న నెమలి సొగసుల్ని తోసిరాజని, చిలుకలూ, గువ్వలూ ఆమె కంఠసీమలో కువకువలాడు తున్నాయి. నాజూకు వేళ్లమీద నాట్యమాడుతున్నాయి. కర్ణాభరణాలుగా కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల పక్షిరాజ్యానికి ఇప్పుడామె రారాణి. పంచవన్నెల చిలుకలన్నీ ఆమె చెలికత్తెలు. వాటి చిన్నెలన్నీ చిత్రికబట్టి ఆమెను అలంకరించే పనిలో డిజైనర్లు మునిగిపోయారు.

‘ప్యారట్ జువెలరీ’, ‘బర్డ్ ఇన్స్పైర్డ్ జువెలరీ’ పేరిట వస్తున్న ఆభరణాలన్నీ అలా ఆమె కోసం ఆవిష్కరించినవే. ఈ తరహా నగల్లో నెక్లెస్‌లు, గొలుసులు మొదలు చెవిదుద్దులు, లాకెట్లు, ఉంగరాలు, బ్రూచ్‌లు.. ఇలా ఎన్నో రకాలు ఉంటున్నాయి. బంగారంతో చేసినవీ, వజ్రాలు పొదిగిన వాటితో పాటు రంగురంగుల ఎనామిల్‌తో రూపొందించిన ఫ్యాన్సీ నగలూ, స్వరోవ్స్కీలాంటి విలువైన రాళ్లతో చేసిన ముచ్చటైన సొమ్ములూ తయారవుతున్నాయి. నల్లపూసల్లోనూ విహంగాల సోకు విందుచేస్తున్నది. మొత్తానికి చిటారు కొమ్మన చిలుకమ్మా…. అమ్మాయి నగలో కులుకమ్మా… అన్న చందంగా అందాల నగలు ముస్తాబవుతున్నాయి.



Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
50% మందికి వర్క్ ఫ్రమ్ హోమ్
హెచ్‌డీఎస్‌ఏ నూతన కార్యవర్గం ఎన్నిక
KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు
KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా
KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

