Rose Water | వామ్మో.. రోజ్ వాటర్‌తో ఇన్ని ప్రయోజనాలా ?
Rose Water | రోజ్ వాటర్‌తో సహజమైన ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలోవెరా జెల్ లేదా తేనె కలిపిన రోజ్ వాటర్ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమవ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది.
Rose Water | రోజ్ వాటర్ మనకు కొత్తేమీ కాదు. వెయ్యేండ్ల క్రితమే వాడుకలో ఉన్నట్టు దాఖలాలు కనిపిస్తాయి. రోజ్ వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు. వాటిలో కొన్ని..
- రోజ్ వాటర్‌తో సహజమైన ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలోవెరా జెల్ లేదా తేనె కలిపిన రోజ్ వాటర్ మిశ్రమాన్ని ఓ పది, పదిహేను నిమిషాలు మొహానికి పట్టించి గోరువెచ్చని నీటితో కడిగేస్తే చర్మం శుభ్రమవ్వడమే కాకుండా కాంతిమంతంగా మారుతుంది.
- రోజంతా ఎంత ఒత్తిడి ఉన్నా, సాయంవేళ రోజ్ వాటర్‌తో అరోమాథెరపీ చేస్తే… ఉపశమనం తథ్యం. రోజ్ వాటర్ సువాసన వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది.
- రోజ్ వాటర్‌లో వాపును తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు, సూక్ష్మక్రిములను చంపే యాంటీ మైక్రోబియల్ గుణాలు అపారం. ఇవి చర్మానికి సోకే ఇన్ఫెక్షన్లు, మొటిమలకు విరుగుడుగా పనిచేస్తాయి.
- సూర్యరశ్మి వల్ల కమిలిన చర్మానికి రోజ్ వాటర్ కొత్త జీవం పోస్తుంది. మంటను తగ్గించి, చర్మం ఆరోగ్యంగా మారేందుకు సాయపడుతుంది.
- చర్మానికి తేమను అందిస్తుంది. ఆ సువాసన మంచి అనుభూతిని కలిగిస్తుంది. చల్లని నీటితో మొహం కడుక్కుని రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో అద్దుకుంటే, ఎంత ఉపశమనంగా అనిపిస్తుందో.. ఒక్కసారి ప్రయత్నిస్తే మీకే తెలుస్తుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

