నడకతో బీపీ పరార్
మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు నడివయసు రాకముందే బీపీకి గురయ్యేలా చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా హైబీపీ, లోబీపీతో సతమతమవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. బీపీ కారణంగా హృద్రోగానికీ చేరువ అవుతున్నారు.
మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు నడివయసు రాకముందే బీపీకి గురయ్యేలా చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా హైబీపీ, లోబీపీతో సతమతమవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. బీపీ కారణంగా హృద్రోగానికీ చేరువ అవుతున్నారు. అయితే, రక్తపోటు నియంత్రణకు వ్యాయామానికి మించిన మందులేదని వైద్యుల సలహా. అలాగని భారీ కసరత్తులు చేయాల్సిన పనిలేదు. రోజూ 45 నిమిషాలపాటు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి సాధారణ శారీరక శ్రమతో రక్తపోటు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు రక్తపోటు పట్టుతప్పుతుంది. అలాకావొద్దంటే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం ఉదయం నడక మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో వ్యాహ్యాళికి వెళ్లొస్తే.. బీపీ నార్మల్ అవుతుంది. ఆరోగ్యమూ కుదుటపడుతుంది. స్మోకింగ్, మద్యపానం లాంటి దురభ్యాసాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జంక్‌ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్‌లో ఉప్పు శాతం ఎక్కువ. కాలక్షేపానికి వాటి మీద పడితే.. రక్తపోటు ముదిరి గుండెకు చేటు కలుగుతుంది. అందుకే, జంక్‌ఫుడ్ జంక్షన్లో తచ్చాడకుండా.. ఇంటివంటపై మనసు పారేసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. ఆరోగ్యం మెరుగ్గా మారుతుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

