అమ్మలకు కునుకు పాట్లు!
వేసవి సెలవులు అమ్మలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్నాయి. పిల్లలు ఇంటిపట్టున ఉంటే తల్లులకు సంతోషమే! అయితే, మారిన కాలమాన పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు.
వేసవి సెలవులు అమ్మలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్నాయి. పిల్లలు ఇంటిపట్టున ఉంటే తల్లులకు సంతోషమే! అయితే, మారిన కాలమాన పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లలు ఇంటిపట్టున ఉండటంతో వారి యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ అమ్మలు కుంగిపోతున్నారట. ఉద్యోగాలు చేయని మహిళలు సైతం పనిభారంతో సతమతమవుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.
పిల్లలు ఇంట్లోనే ఉండటం, పని పెరగడం ఈ కారణాలన్నీ అమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. ఫలితంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవ్వడమే కాక, నిద్రలేమితో బాధపడుతున్నారని సర్వే సారాంశం. సెలవుల కారణంగా పిల్లల నిద్రవేళల్లో మార్పులు కూడా తల్లుల్లో నిద్రలేమికి కారణంగా విశ్లేషిస్తున్నారు.
చిన్నారులు వేళ కాని వేళ పడుకోవడం, తక్కువ నిడివి నిద్ర కారణంగా వారి సంరక్షణ బాధ్యత పెరుగుతున్నదట. వారి ఆలనాపాలనా చూస్తూ అమ్మలు ప్రశాంత నిద్రకు దూరమవుతున్నారని స్టడీ చెబుతున్నది. మొత్తంగా ఉద్యోగాలు చేస్తున్న తల్లులకు, ఇంటిపట్టున ఉంటున్న అమ్మలకు వేసవి సెలవులు భారంగానే గడుస్తున్నాయి. అయితే, పిల్లలను వేసవి శిక్షణ తరగతులకు పంపితేనో, ఇతర వ్యాపకాల్లో బిజీగా ఉంచితేనో కొంతలో కొంతైనా సమయం చిక్కుతుందని సర్వేకారులు చెబుతున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

