Beauty Tips | నాలుగు పలకల చెవిపోగులు.. వీటి ప్రత్యేకత ఇదే
Beauty Tips | ట్రెండ్‌తో కలిసి సాగాలి. గుంపులో మాత్రం కలిసిపోకూడదు. అలా మనల్ని మనం నలుగురిలో విభిన్నంగా చూపించుకోవాలంటే స్టేట్మెంట్ నగలకు మించిన మార్గం లేదు. అందులోనూ వైవిధ్యం కనబరిచేలా వస్తున్నవే స్కేర్ ఇయర్ రింగ్స్.
Beauty Tips | ట్రెండ్‌తో కలిసి సాగాలి. గుంపులో మాత్రం కలిసిపోకూడదు. అలా మనల్ని మనం నలుగురిలో విభిన్నంగా చూపించుకోవాలంటే స్టేట్మెంట్ నగలకు మించిన మార్గం లేదు. అందులోనూ వైవిధ్యం కనబరిచేలా వస్తున్నవే స్కేర్ ఇయర్ రింగ్స్. నాలుగు పలకల చెవిపోగులు.. నాలుగందాల ప్రత్యేకం మరి!
చెవిపోగులు రోజూ పెట్టుకునేవే. కానీ పార్టీలసమయంలో కాస్త ప్రత్యేకంగా ఉండేవాటినే ఇష్టపడతాం. అలా అని, ప్రతిసారీ భారీ నగల్ని ఎంచుకోలేం. అలాంటి సందర్భాల్లో ఇటు ప్రత్యేకంగా, అటు సింపుల్‌గా కనిపించేందుకు పనికొస్తాయి నాలుగు పలకల చెవిపోగులు. చుట్టూ నాలుగు కడ్డీలతో.. మధ్యలో ఖాళీగా కనిపించడం వీటి ప్రత్యేకత. నలుచదరానికి కిందివైపు మువ్వలు వేలాడేవీ, పూసలు జోడించినవీ, చుట్టూ రాళ్లు పొదిగినవీ వస్తున్నాయి. చెవి దుద్దు ఉండి కిందకి చదరం వేలాడేలా, హూప్స్ తరహావి, హ్యాంగింగ్ లాంటివి సైతం ఇందులో ఉంటున్నాయి.
చతురస్రమేనా..
దీర్ఘచతురస్రమూ ఈ తరహా చెవి పోగుల్లో తళుక్కుమంటున్నది.
బంగారంలో వజ్రాలు పొదిగినవి, వెండితో చేసినవి, ఫ్యాన్సీ మాడల్స్ కూడా కనువిందు చేస్తున్నాయి.
చుడీదార్ మీదకి కూడా బాగున్నా.. జీన్స్, మినీ ఫ్రాక్లకైతే ప్రత్యేకమైన లుక్ ఇస్తాయి.
నైట్ పార్టీ కోసమైతే ఈ తరహాలో వస్తున్న ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ మ్యాచింగ్. పార్టీ ఏదైనా సమ్‌థింగ్ స్పెషల్ కావాలనుకుంటే మాత్రం వీటిని ఎంచుకోవచ్చు. మొత్తానికి ఇలా, లెక్కల్లో కనిపించే చతురస్రం ఫ్యాషన్‌కి కొత్త ఫార్ములా అవుతున్నది!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

