art_bhagyashree.. ముగ్గులతో సృష్టించిన ముచ్చటైన కళా జగత్తు. భాగ్యశ్రీ..
నేలనే క్యాన్వాసుగా మలుచుకుంటారు.
వేలి కొసలను కుంచెగా వాడుకుంటారు.
ముగ్గుపిండితో సప్త వర్ణాలు సృష్టిస్తారు.
రంగవల్లికలే కాదు.. దశావతారాలు, పాండురంగ విఠలుడు, జగదాంబ.. ఇలా ఆధ్యాత్మిక జగత్తుకూ ప్రాణం పోస్తారు. ఆమె ఇన్స్టా అకౌంట్లోకి వెళ్తే ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన అనుభూతి కలుగుతుంది.