ఫ్యాషన్ ముగ్గులు!
సంక్రాంతి వేళ రంగవల్లికల అల్లికలు లోగిళ్లను అలంకరిస్తాయి. అందాన్ని అమాంతం వాకిట్లోకి తెచ్చి పెడతాయి.
సంక్రాంతి వేళ రంగవల్లికల అల్లికలు లోగిళ్లను అలంకరిస్తాయి. అందాన్ని అమాంతం వాకిట్లోకి తెచ్చి పెడతాయి. ఈ ముస్తాబును చూసి ముచ్చట పడ్డ ఫ్యాషన్… తానే స్వయంగా ముగ్గులోకి దిగింది. ఇంకేం, మెలికల సొగసులన్నీ చుక్కలతో కలిసి చొక్కాల మీద వెలిగిపోతున్నాయి. ముగ్గు ప్రింట్లు… పెద్ద పండుగ ట్రెండ్!
అందాన్ని వినూత్నంగా చూపించడం ఫ్యాషన్‌కు అలవాటు. సంప్రదాయానికి ఆధునిక రంగులు అద్దడం కూడా దానికి పరిపాటే. అందుకే మనం తరతరాల నుంచి ఇంటిముందు వేసుకునే ముగ్గులను ముచ్చటగా తన ముంగిట్లోనూ నిలుపుకొంది. వస్ర్తానికి ముగ్గు వన్నెలద్దుతున్నది. అమ్మాయిల అల్ట్రాఫ్యాషన్ దుస్తుల్లోనూ, అబ్బాయిల చొక్కాల మీదా, యాక్సెసరీల్లోనూ ‘ముగ్గు ప్రింట్లు’ లేదా ‘కోలం ప్రింట్లు’ సరికొత్త చేరిక.
ముగ్గు ముచ్చట
కళ్లాపి చల్లిన వాకిలికి ముత్యాల ముగ్గులు గొలుసులైతే, రత్నాల ముగ్గులు రవ్వల దుద్దులు. ఆ అలంకారం చూసి అటునుంచి వెళ్లే ఎవరైనా ఆగి చూడాల్సిందే. అచ్చం అలాగే ఫ్యాషన్ ప్రపంచమూ ఈ రంగవల్లికల్ని అలంకరించుకుంటున్నది. చీరలు, దుపట్టాల మీదే కాదు, స్లీవ్‌లెస్ సింగిల్ పీస్ డ్రెస్సుల్లోనూ వీటిని జొప్పిస్తున్నారు సృజనకారులు. కొత్తదనాన్ని కోరుకునే అబ్బాయిల కోసం కూడా కోలం ప్రింటెడ్ చొక్కాలను తయారు చేస్తున్నారు.
చుడీదార్లు, చున్నీలతో పాటు చీరకు జోడీగా జాకెట్ మీదా ఈ ముగ్గులను ముస్తాబు చేస్తున్నారు. దిండ్లు, దుప్పట్లు, హ్యాండ్ బ్యాగులపైనా ఇవి కనువిందు చేస్తున్నాయి. మగ్గులు, ఫోన్కేసులపైనా ధనుర్మాసపు రథాలు పరిగెడుతున్నాయి. రంగుల మీదే ముగ్గులుండటంతో ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇంకేం, వాకిట్లో కనిపించే ముగ్గుల్ని, వస్ర్తాల మీదా పరిచేయొచ్చు. అమ్మాయిలకు మాత్రమే పరిమితమైన రంగవల్లికల్ని అబ్బాయిల ఆహార్యంలోనూ చేర్చవచ్చు. దసరా బుల్లోడులాగా.. సంక్రాంతి పిల్లోడు అనిపించుకోవచ్చు…
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

