రూప పెమ్మరాజు.. న్యూయార్క్లో భారతీయతకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫ్యాషన్ డిజైనర్. తనకు సంప్రదాయ కళల పట్ల అపారమైన గౌరవం. అందులోనూ గిరిజనులు.. కొమ్మ రెమ్మలకు కొత్తరూపమిచ్చే తీరు మరింత ఇష్టం.
ఆ ప్రభావంతోనే ఈ ఫ్లోర్ లెన్త్ గౌన్ రూపొందించారు. ‘ఇదో స్లో ఫ్యాషన్ క్లాసిక్’ అంటూ తన ఆవిష్కరణ గురించి వివరిస్తారామె. ఇందులోని వర్ణాలన్నీ ప్రకృతిలోంచి తీసుకున్నవే. రసాయనాల జాడే లేదు.