ఆకాశ నీలానికి అందమైన కలయిక ఏదంటే.. గులాబీ వన్నెకు మించింది మరోటి ఉంటుందా అంటుంది నారీ లోకం. నిజమే, ఆ రెంటి మేలు కలయికా ఎవర్గ్రీన్ కాంబినేషన్.
మస్లిన్ వస్త్రంతో కుట్టిన గులాబీ వన్నె డ్రెస్‌కు డిజిటల్ ప్రింటెడ్ నీలి రంగు లెనిన్ దుపట్టాను జోడించారు డిజైనర్లు. మృదువుగా జాలువారే మస్లిన్ వస్త్రం మీద వచ్చిన ఇకత్ ప్రింట్ డ్రెస్‌కు సంప్రదాయ అందాన్ని ఆపాదిస్తే, చున్నీ మీద వచ్చిన డిజిటల్ ప్రింట్స్ కాంటెంపరరీ లుక్‌ను కట్టబెట్టాయి.
– సమతా చౌదరి, డిజైనర్ wowobySamathachowdari