ఒకప్పుడు ‘ఇంటి సమస్యలను ఇంటి దగ్గరే వదిలేసి ఆఫీసుకి రావాలి’ అనేవారు. కానీ నేటి జెన్-జీ తరానికిఇది సాధ్యం కావడం లేదు. వారి వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా వారి ప్రేమ వ్యవహారాలు, ఆఫీసులోవారి పనితీరుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే, పర్సనల్ హ్యాపీనెస్ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ని డైరెక్ట్‌గా ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నది! జెన్ జీ మైండ్‌సెట్, రిలేషన్షిప్ డైనమిక్స్… కెరీర్ గ్రోత్‌పై ఎఫెక్ట్ చూపుతున్నాయని తెలుస్తున్నది.
రిలేషన్షిప్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు జెన్-జీ ఉద్యోగులు ఆఫీసులో అత్యంత ఉత్సాహంగా, సృజనాత్మకంగా పనిచేస్తున్నారట. భాగస్వామి ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఇది నేరుగా వారి పనితీరు మెరుగుపడటానికి దోహదపడుతుంది. ప్రేమలో ఉన్న సంతోషం వారిని ఆఫీసు ఒత్తిడిని కూడా సులభంగా తట్టుకునేలా చేస్తుంది. జెన్ జీ మైండ్‌సెట్‌లో పర్సనల్ ఫుల్ఫిల్మెంట్లు, ఫ్రొఫెషనల్ సక్సెస్ వేరు వేరు కాదు.. అవి ఇంటర్‌కనెక్టెడ్! ఒకవేళ పర్సనల్ లైఫ్‌లో సపోర్టివ్, అండర్స్టాండింగ్ కనెక్షన్స్ ఉంటే.. అది వర్క్‌లైఫ్‌లో కాన్ఫిడెన్స్, ఎమోషనల్ స్టెబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది.

పాజిటివ్ ఇంపాక్ట్: రిలేషన్షిప్ బాగున్నప్పుడు ఉద్యోగులు ఎక్కువ ఫోకస్‌తో పనిచేస్తారు. టీమ్ మెంబర్స్‌తో కూడా సానుకూలంగా మెలుగుతారు.
నెగటివ్ ఇంపాక్ట్: బ్రేకప్స్ లేదా ఇంట్లో గొడవలు జరిగినప్పుడు.. ఆందోళన, ఏకాగ్రత లోపించడం వల్ల పనిలో తప్పులు దొర్లే అవకాశం ఉంది.
ఎమోషనల్ రెగ్యులేషన్: జెన్-జీ తమ ఎమోషన్స్‌ను దాచుకోలేరు. అందుకే వారి మూడ్ ఆఫీస్ వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఈ తరం వర్క్, లైఫ్ రెండిటినీ వేర్వేరుగా చూడటం లేదు. వారి కెరీర్ ఎదుగుదల వారి వ్యక్తిగత సంతోషంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీలు కూడా ఈ విషయాన్ని గుర్తించి, ఉద్యోగుల మానసిక ఆరోగ్యం కోసం ‘మెంటల్ హెల్త్ లీవ్స్’ లేదా ‘కౌన్సెలింగ్’ లాంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నది. రిమోట్ వర్క్, ఫ్లెక్సిబుల్ అవర్స్, ఫ్రీలాన్సింగ్ లాంటి ఆప్షన్స్ వల్ల జెన్ జీకి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి మరింత స్పేస్ లభించినట్టు అవుతున్నది.

ప్రేమ జీవితం పనిని ప్రభావితం చేయడం సహజమే అయినా, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
డిజిటల్ బౌండరీస్: ఆఫీసు పని వేళల్లో నిరంతరం భాగస్వామితో చాటింగ్ చేయడం వల్ల పని దెబ్బతినే ప్రమాదం ఉంది.
ప్రొఫెషనలిజం: వ్యక్తిగత గొడవలను ఆఫీసు మీటింగ్స్‌లో ప్రదర్శించకుండా చూసుకోవాలి.
సెల్ఫ్-కేర్: మీ సంతోషం కేవలం మరొక వ్యక్తిపైనే ఆధారపడకుండా, మీకంటూ ఒక సొంత అభిరుచిని (Hobby) పెంచుకోవాలి.
మనం ఎంత బిజీ అయినా.. చివరికి మనుషులం. మనకు రిలేషన్స్ అవసరం, బ్యాలెన్స్ అవసరం! లవ్ లైఫ్ మనకు ఎమోషనల్ ఫ్యూయెల్ ఇవ్వగలదు. వర్క్ లైఫ్‌లో అభివృద్ధికి దోహదం చేయగలదు. రెండూ కలిసి వర్క్ అయితే.. మన లైఫ్ మరింత మీనింగ్‌ఫుల్‌గా మారుతుంది.