హంస పాదాలు.. నెమలి సోకులు!
చిలుక ముక్కు, హంస నడక, నెమలి నాట్యం, కోకిల స్వరం.. అంటూ మగువల సౌందర్యాన్ని పక్షులతో పోలుస్తారు.
చిలుక ముక్కు, హంస నడక, నెమలి నాట్యం, కోకిల స్వరం.. అంటూ మగువల సౌందర్యాన్ని పక్షులతో పోలుస్తారు. నిజానికి, ఆడవాళ్ల నగల డిజైన్లలో అగ్రతాంబూలం నెమలిదే. అందులోనూ, పాదాలకు ధరించే పట్టీలు.. నెమలమ్మకు సైతం అసూయ పుట్టేంత అందంగా ఉంటున్నాయి.
‘పీకాక్ డిజైన్ యాంక్లెట్స్’ మార్కెట్‌ను ఏలేస్తున్నాయి.
పసిబిడ్డ నుంచి పడుచుపిల్ల దాకా.. ఎవరికైనా మువ్వల పాదాలు ముద్దుగా కనిపిస్తాయి. మనసుపెట్టి వింటే.. సరిగమల సంగతులన్నీ సిరిమువ్వల్లోనూ వినిపిస్తాయి. పాదాలకు ధరించే పట్టీలు మరింత మనోహరంగా ఉండాలనే ఆలోచనతో మయూర డిజైన్లను పొందుపరుస్తున్నారు తయారీదారులు.
హరివిల్లును తలపించే సప్తవర్ణాల ఎనామిల్‌తో నెమలి అందాలను ఆవిష్కరిస్తున్నారు. వెండి, బంగారు.. ఇలా వివిధ లోహాలతో రూపొందిస్తున్నారు. మువ్వలు, రంగురంగుల రాళ్లు, పూసలు, కుందన్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. కాలికి నిండుగా పెద్దపెద్ద నెమళ్ల డిజైన్లతో పాటు, నాజూకు గొలుసులతో హుక్కుల దగ్గర నెమళ్లు వచ్చేలా రూపొందిన సాదాసీదా రకం వరకూ.. ఎన్నో మోడళ్లు! పీకాక్ డిజైన్ యాంక్లెట్ లేదా పాయల్ పేరిట ఈ పట్టీలు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ దొరుకుతున్నాయి. చీర, గాగ్రా, చుడీదార్, లంగావోణీ.. ఏ దుస్తుల మీదికైనా చక్కగా నప్పుతాయి. నచ్చితే, మీ పాదాలకూ మయూర సౌందర్యాన్ని అద్దేయండి మరి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

