సగం..సగం.. ఉంగరం!
ఎవరి ఉంగరానికి వాళ్ల పేరులోని అక్షరం ఉండటం సాధారణం. కాదంటే జీవిత భాగస్వామి పేరును వేలికి తొడుక్కొని మురిసిపోతారు. ఇప్పుడైతే ఇద్దరి పేర్లూ ఒకే ఉంగరంలో ఒదిగిపోయేలా, ఇద్దరిలో ఎవరైనా ఆ ఉంగరాన్ని ధరించేలా ‘కపుల్ నేమ్ రింగ్స్' రూపొందుతున్నాయి.
ఎవరి ఉంగరానికి వాళ్ల పేరులోని అక్షరం ఉండటం సాధారణం. కాదంటే జీవిత భాగస్వామి పేరును వేలికి తొడుక్కొని మురిసిపోతారు. ఇప్పుడైతే ఇద్దరి పేర్లూ ఒకే ఉంగరంలో ఒదిగిపోయేలా, ఇద్దరిలో ఎవరైనా ఆ ఉంగరాన్ని ధరించేలా ‘కపుల్ నేమ్ రింగ్స్’ రూపొందుతున్నాయి. వీటినే డబుల్ నేమ్ రింగ్స్, టూ నేమ్స్ రింగ్స్ అనికూడా పిలుస్తారు. ఫ్యాషన్, ఎమోషన్ కలబోతగా వస్తున్న ఈ ఉంగరాలు జంటల వేళ్లను ముద్దుగా ముస్తాబు చేస్తున్నాయి.
వరుడి దక్షిణ హస్తంలో వధువు వామహస్తం ఉంచింది మొదలు… ఇక ఒకరి చేయి ఒకరు విడిచే అవకాశమే రాదు. అంతగా పెనవేసుకుపోయే ఆ అనుబంధానికి వేళ్లు నాందీ వాచకాలు. అందుకే, పెళ్లినాడే ఒకరి వేలికి మరొకరితో ఉంగరాన్ని తొడిగించి వలపు వాకిలి తలుపు తెరుస్తారు. అలాంటి అందమైన వేడుకలో భాగమవ్వదగినంత చూడచక్కగా ‘కపుల్ నేమ్ రింగ్స్’ రూపొందిస్తున్నారు తయారీదారులు. ఇక్కడ భార్య, భర్త ఇద్దరి పేర్లూ ఒకే ఉంగరం మీద చక్కని అక్షరాలతో చెక్కి ఉంటాయి. ఆ అక్షరాలు ఓ ముచ్చటైన డిజైన్‌లో ఒదిగిపోయి కనిపిస్తాయి. ఫ్యాన్సీతో పాటు బంగారం, ప్లాటినం, రోజ్గోల్డ్లాంటి వాటితో ఈ అంగుళీకాలను తీర్చిదిద్దుతున్నారు. పేర్ల చుట్టూ రాళ్లు పొదిగినవీ, అక్షరాల వరుసల మధ్య రత్నాలు మెరిసేవీ, లతలా అల్లినట్టు ఉన్న ఉంగరం మీద అక్షరాల మాలలు అమరినట్టు కనిపించేవీ.. ఇలా బోలెడు రకాలు. మరీ ఫ్యాన్సీగా కనిపించేవి మినహా మిగతా ఉంగరాలు ఆడ, మగ.. ఇద్దరూ ధరించేలా ఉంటున్నాయి. పేర్లతో పాటు, ఉంగరం లోపలి భాగంలో ఐ లవ్ యు, ఫర్ ఎవర్.. తదితర స్టేట్మెంట్స్తోనూ వస్తున్నాయి. పెండ్లయిన కొత్తలోనే కాదు, పాత కాపురాన్ని కాస్త కొత్తగా ఆస్వాదించాలనుకునే జంటలూ ఈ కపుల్ రింగ్‌ను ఇంటికి తెచ్చుకోవచ్చు!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

