Dear Zindagi | నాన్నకు రెండో పెండ్లి.. అదీ తనకంటే 20 ఏండ్లు చిన్నదైన మహిళతో..!
నాకు పన్నెండేండ్లు ఉన్నప్పుడు అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగులే. దీంతో ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. నేను అమ్మ దగ్గరే ఉంటాను. అప్పుడప్పుడూ నాన్న ఇంటికి వెళ్తుంటాను. ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి.
Dear Zindagi | నాకు పన్నెండేండ్లు ఉన్నప్పుడు అమ్మానాన్న విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ ఉద్యోగులే. దీంతో ఎవరి బతుకు వారు బతుకుతున్నారు. నేను అమ్మ దగ్గరే ఉంటాను. అప్పుడప్పుడూ నాన్న ఇంటికి వెళ్తుంటాను. ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నన్ను ప్రేమగా చూసుకుంటారు. తరచూ బహుమతులు ఇస్తారు. ఫోన్ చేసి నా యోగక్షేమాలు తెలుసుకుంటారు. చదువు, కెరీర్ విషయంలో సాయం చేశారు. ఓ సారి నేను వెళ్లేసరికి నాన్నతో పాటు ఓ మహిళ ఉంది. ముప్పై ఏండ్లు ఉంటాయి.
ఆకర్షణీయంగా ఉంది. ఆమెను పరిచయం చేస్తూ ‘ఈమె నా స్నేహితురాలు. చాలా కాలం నుంచీ తెలుసు. బాగా చదువుకుంది. తనను పెండ్లి చేసుకునే ఆలోచన ఉంది’ అని చెప్పారు. అదొక పెద్ద షాక్. ఈ వయసులో వివాహం ఏమిటి? అందులోనూ తనకంటే ఓ ఇరవై ఏండ్లు చిన్నదైన మహిళతో? అమ్మకు తెలిస్తే ఎలా స్పందిస్తుందో అని భయంగా ఉంది. అసలే తను హార్ట్ పేషెంట్. ఇప్పుడు నేనేం చేయాలి?
- ఓ పాఠకురాలు
నిజమే. ఉద్వేగపరంగా చాలా ఇబ్బందికరమైన సందర్భమే. అటు అమ్మ, ఇటు నాన్న. మధ్యలో ఓ మహిళ. ఎటూ తేల్చుకోలేని కూతురు స్థానంలో మీరు. ఒకసారి జరిగిన విషయాలన్నీ ఒక కాగితం మీద రాసుకోండి. మీకు తోచిన పరిష్కారాలతో ఓ చిట్టా తయారు చేసుకోండి. మరొక్క మాట.. ఇప్పటికే మీ నాన్న విడాకులు తీసుకున్నారు. చాలాకాలం నుంచి ఒంటరిగా జీవిస్తున్నారు.
వయసులో కొంత వ్యత్యాసం ఉండవచ్చు. కానీ, ఇప్పటికైనా తనకంటూ ఓ తోడు దొరికింది. ఎంతోకొంత సంతోషించాల్సిన విషయమే ఇది. తెగతెంపులు చేసుకున్న భర్తకు మీ అమ్మగారి మనసులో ఇంకా స్థానం ఉందనే అనుకుంటున్నారా? అదే నిజమైతే, ఇద్దర్నీ కలిపే ప్రయత్నం ఎందుకు చేయలేదు. ముందుగా ఆమెతో మాట్లాడండి. సమాజం అంటారా? కొద్దిరోజులు మాట్లాడుకుంటారు, చర్చించు కుంటారు, నవ్వుకుంటారు. ఆ తర్వాత వాళ్లే మరిచిపోతారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

