Parenting Tips | ఎంత బుజ్జగించినా మా పాప అన్నం తినట్లేదు.. చాక్లెట్లు, కోక్ కావాలంటోంది? ఎలా నచ్చజెప్పాలి?
Parenting Tips | మా పాపకు ఆరేండ్లు. ఎంత బుజ్జగించినా అన్నం తినదు. పాలు తాగదు. ఎప్పుడూ చాక్లెట్లు, బర్గర్లు, పెప్సీ-కోక్ లాంటివే కావాలంటుంది. కొనివ్వకపోతే ఏడుస్తుంది. ఈ కారణంగా నాకూ, నా బిడ్డకూ మధ్య అగాధం ఏర్పడింది. ఎంత పిలిచినా నా దగ్గరికి రావడం లేదు. నా కూతురి మనసు మార్చడమెలా? తన చిరుతిళ్ల అలవాటును దూరం చేయలేమా?
Parenting Tips | మా పాపకు ఆరేండ్లు. ఎంత బుజ్జగించినా అన్నం తినదు. పాలు తాగదు. ఎప్పుడూ చాక్లెట్లు, బర్గర్లు, పెప్సీ-కోక్ లాంటివే కావాలంటుంది. కొనివ్వకపోతే ఏడుస్తుంది. తనను మార్చడానికి నా వంతు ప్రయత్నం చేశాను. తిట్టాను, కొట్టాను. మరింత మొండిగా మారిందే కానీ ఎలాంటి మార్పూ రాలేదు. తను ఏడిస్తే చాలు. మా మామగారు కరిగిపోతారు. బయటికి తీసుకెళ్లి ఇష్టమైనవన్నీ కొనిస్తారు. దీంతో, అప్పటివరకూ నేను పడిన శ్రమంతా వృథా అయిపోతుంది. ఎంతకాలమిలా? ఈ గొడవల కారణంగా నాకూ, నా బిడ్డకూ మధ్య అగాధం ఏర్పడింది. ఎంత పిలిచినా నా దగ్గరికి రావడం లేదు. నా కూతురి మనసు మార్చడమెలా? తన చిరుతిళ్ల అలవాటును దూరం చేయలేమా?
– ఓ పాఠకురాలు
పిల్లల భవిష్యత్తును నష్టపరిచే ఏ చర్యలనైనా ఖండించాల్సిందే. ముందుగా మీ మామగారితో మాట్లాడండి. చిరుతిళ్ల వల్ల పిల్లల దంతాలకు ఎంత నష్టమో చెప్పండి. బాల్యంలోనే ఊబకాయం వస్తే ఎంత ఇబ్బందికరమో వివరించండి. బిడ్డ అలవాటు మార్చే ప్రయత్నంలో సహకరించమని అడగండి. ఆయన తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీ అమ్మాయికి నేరుగా మీరు చెప్పడం కంటే.. బాగా తెలిసిన డాక్టర్ ఎవరైనా చెబితే బుర్రకెక్కుతుంది.
ఈ విషయంలో ఫ్యామిలీ డాక్టర్ సహకారం తీసుకోండి. డెంటల్ క్లినిక్‌కు తీసుకెళ్లి.. చిరుతిళ్ల కారణంగా దంతాలు పాడైపోయిన పిల్లల ఫొటోలు చూపించండి. అవసరమైతే పళ్లు పీకాల్సి ఉంటుందనీ, రోజూ ఇంజెక్షన్లు తప్పవనీ భయపెట్టండి. కొన్ని అతిశయోక్తులు జోడించినా తప్పేం లేదు. చెడును ఎంత త్వరగా వదిలిస్తే అంత మంచిది. కాకపోతే, ఒక్కసారిగా బంద్ చేస్తే పిల్లలు తట్టుకోలేరు. కొంచెం కొంచెంగా తగ్గిస్తూ వెళ్లండి. అదే సమయంలో పండ్లు, ఎండు ఫలాలు మొదలైన ఆరోగ్యకరమైన రుచులు అలవాటు చేయండి. తనకు ఇష్టమైన ఆహారంలో కాయగూరలు ఎక్కువగా వేయండి. పుస్తకాలు, సంగీతం, పెయింటింగ్.. ఇలా కొత్త అలవాట్లు పరిచయం చేయండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

