క్రాప్‌టాప్.. ఫ్యాషన్‌లో ఎప్పుడూ టాపే. ఇక అది జోడు రంగుల కలనేతలో వస్తే అది డబుల్ ధమాకాలా అదరగొడుతుంది. వక్కరంగు వన్నెల్లో నటి మధుమిత ధరించింది ఆ తరహా క్రాప్‌టాప్ లెహంగానే. మెరిసే శాటిన్ వస్త్రం మీద ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చేసిన ఇది పర్ఫెక్ట్ పార్టీ పీస్ అనిపించేలా ఉంది.
నడుం పట్టీ మీద వచ్చిన బంగారు రంగు వర్క్ డ్రెస్‌కి ప్రత్యేక లుక్ తీసుకొచ్చింది. ఇక, దీనికి నగలు జోడిస్తే వగల రాణి మీరే అన్నంత అందంగానూ ఉంటుంది.
– సమతా చౌదరి, డిజైనర్ wowobySamathachowdari