Mehndi | మెహిందీ కోన్ పట్టుకోవడం రాకపోయినా అరచేతిపై అద్భుతమైన డిజైన్లు వేసుకోవచ్చు!
Mehndi | అరచేత గోరింట పూయాలంటే ఆషాఢం రావాల్సిందే. వీలున్న వాళ్లు గోరింటాకులు రోట్లో వేస్తే, అరచేయి ఎర్రబారితే చాలనుకునేవాళ్లు మెహందీని ఆశ్రయిస్తారు. మరికొందరైతే ఆషాఢాన్ని అలా ఇలా కానిచ్చేస్తే కుదరదు.. హస్తకమలాలకు అద్భుతమైన కళ తీసుకురావల్సిందేనంటూ మెహందీ ఆర్టిస్టులను సంప్రదిస్తారు.
Mehndi | అరచేత గోరింట పూయాలంటే ఆషాఢం రావాల్సిందే. వీలున్న వాళ్లు గోరింటాకులు రోట్లో వేస్తే, అరచేయి ఎర్రబారితే చాలనుకునేవాళ్లు మెహందీని ఆశ్రయిస్తారు. మరికొందరైతే ఆషాఢాన్ని అలా ఇలా కానిచ్చేస్తే కుదరదు.. హస్తకమలాలకు అద్భుతమైన కళ తీసుకురావల్సిందేనంటూ మెహందీ ఆర్టిస్టులను సంప్రదిస్తారు. ఆ డిజైన్లేవీ రాకపోయినా, అసలు కోన్ సరిగా పట్టుకోవడమే తెలీకపోయినా మీ అరచేతి మీద అద్భుతమైన డిజైన్లను మీరే వేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ‘రీ యూజబుల్ సిలికాన్ హెన్నా స్టెన్సిల్స్ ( Reusable Silicon Henna Stencils )’. ఇందులో చిన్నాపెద్దా డిజైన్ల ఎంపిక మనదే!
భారతదేశంలో గోరింట స్థానం ప్రత్యేకం. పండుగ, పెండ్లి, పుట్టినరోజు… ఇలా శుభకార్యం ఏదైనా అతివ అరచేతి మీద గోరింటాకు విరియాల్సిందే. అవికాక తెలుగువారికి ఆషాఢమాసం మరింత ప్రత్యేకం. తెలంగాణ బోనమెత్తి పసుపు కుంకుమల కళ సంతరించుకుంటే, ఆడబిడ్డల అరచేతులూ గోరింట కళతో మెరిసిపోతాయి. గోరింట అందరికీ అందుబాటులో ఉండదు కనుక, మెహందీ కోన్‌కు ఓటేసే వాళ్లే ఎక్కువ. అయితే, కోన్‌ను నేర్పుగా పట్టుకుని ఓర్పుగా డిజైన్లు గీయాలి. అది అందరికీ రాదు. అందుకే మెహందీ డిజైన్లను చేతి మీద మనమే ముద్రించుకోగలిగేలా ‘సిలికాన్ హెన్నా స్టెన్సిల్స్’ వస్తున్నాయి.

Mehndi1
ఎలా పెట్టుకోవాలి?
మెహందీ స్టెన్సిళ్లను సిలికాన్‌తో తయారుచేస్తారు. అంటే మెత్తటి రబ్బరులా ఉంటుంది ఇది. చేయి ఆకృతిలో ఉండి దానిమీద రకరకాల డిజైన్ల గీతలు ఉంటాయి. అంటే ఆ డిజైన్ అంతా ఖాళీ ఉండి, మిగతా భాగం సిలికాన్ ఉంటుంది. వెనకవైపు ఉండే పేపర్‌ను తొలగించి ఈ స్టెన్సిల్‌ను చేతికి అతికించుకొని ఆ ఖాళీల్లో మెహందీని నింపితే చేయిమీద అందమైన డిజైన్ పండుతుందన్నమాట. ఎండిపోయాక స్టెన్సిల్ తీసి కడుక్కుంటే మళ్లీ కావాలనుకున్నప్పుడు దాంతో డిజైన్ చేసుకోవచ్చు. విభిన్న రంగుల్లో దొరికే వీటిలో.. చేయి వరకూ వేసుకునేవి, మోచేయి దాకా పెట్టుకునేవీ, మధ్యస్థంగా ఉండేవీ.. ఇలా రకరకాల సైజులవి విభిన్న డిజైన్లలో దొరుకుతున్నాయి. అంతేకాదు బార్డర్లు వేసుకోవడానికి ప్రత్యేకంగానూ, కేవలం చిన్న పువ్వులా కావాలంటే అంతవరకూ మాత్రమే ఉండేవీ.. ఇలా రకరకాలు దొరుకుతున్నాయి. నచ్చింది కొనుక్కొని మెచ్చింది అచ్చేసుకోవడమే. ఇవి ఉంటే ఇక మీరే మెహందీ ఆర్టిస్టు అయిపోవచ్చు. ఏమంటారు?!
Read More :
“ఆషాఢంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి?”
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
- Tags
- fashion
- mehendi designs
- mehndi
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

