Apps:
Follow us on:

సమ్మర్‌లో ఏసీలు అధికంగా వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్‌గా పాటించండి

1/8బయట ఎండ ఎక్కువగా ఉందని చాలామంది ఏసీలో టెంపరేచర్‌ను బాగా తగ్గించేస్తుంటారు. రూమ్‌ చల్లగా ఉండాలని కనిష్ట ఉష్ణోగ్రతను 17, 18 డిగ్రీల వరకు తగ్గిస్తారు. కానీ అది కరెక్ట్‌ కాదు. ఏసీల సామర్థ్యం పెరగాలంటే 24 నుంచి 27 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్యనే ఉపయోగించాలి. అప్పుడే ఏసీల మన్నిక పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
2/8ఏసీలు కొనేటప్పుడు దాని రివ్యూ ఎలా ఉంది? మంచి కంపెనీయేనా? కాదా? అని చూస్తుంటారు. కానీ అది తమ గదికి సరిపోతుందా లేదా అనేది చాలామంది పట్టించుకోరు. కానీ ఏసీలు కొనుగోలు చేసేటప్పుడు గది విస్తీర్ణానికి తగినట్లుగా ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
3/8ఉదాహరణకు 120 నుంచి 140 అడుగుల విస్తీర్ణం ఉండే గదికి ఒక టన్‌ కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది. అంతకంటే తక్కువ కెపాసిటీ ఉన్న ఏసీలు కొని తెచ్చుకుంటే.. గదిని చల్లబరిచేందుకు చాలా సమయం తీసుకుంటుంది. దీనివల్ల ఏసీపై ఒత్తిడి పెరుగుతుంది. పైగా విద్యుత్‌ను కూడా ఎక్కువగా వినియోగించుకుంటుంది. ఇలా ఏసీలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి పడితే తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
4/8ఏసీ అవుట్‌ డోర్‌ యూనిట్‌లో కండెన్సర్‌ కాయిల్‌, ప్యాన్‌ ఉంటాయి. ఈ ఫ్యాన్‌ బయట గాలిని సంగ్రహించి కండెన్సర్‌ కాయిల్‌లోకి పంపిస్తుంది. అప్పుడు గదిలోకి చల్లటి గాలి వస్తుంది. అదే ఏసీ అవుట్‌ డోర్‌ యూనిట్‌పై ఎండ ఎక్కువగా పడితే బయట గాలిని చల్లగా మార్చే ప్రక్రియలో కండెన్సర్‌ కాయిల్‌పై ప్రభావం పడుతుంది. ఏసీ సామర్థ్యం తగ్గిపోతుంది
5/8సామర్థ్యం తగ్గకూడదంటే ఏసీ అవుట్‌ డోర్‌ యూనిట్‌ను వీలైనంత వరకు ఎండపడని చోటే ఉంచుకోవాలి. ఇక కొంతమంది అవుట్‌ డోర్‌ యూనిట్‌పై ఎండ పడొద్దని బట్టతో కడుతుంటారు. అయితే ఫ్యాన్‌ తిరుగుతున్న సమయంలో ఆ బట్ట లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల కొత్త ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
6/8ఏసీలు కొని అలా ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోదు. బైక్‌లను, కార్లను నిర్ణీత సమయంలో సర్వీసింగ్‌కు ఇచ్చినట్లే.. ఏసీలకు కూడా సర్వీస్‌ చేయించడం చాలా అవసరం. ఏసీని పట్టించుకోకుండా వదిలేస్తే ఫిల్టర్లు, డక్ట్స్‌లో దుమ్ము, ధూళి పేరుకుపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడూ దాన్ని తొలగించాలి. దీనివల్ల గ్యాస్‌ లీకయ్యే ప్రమాదం ఉండదు. కాబట్టి కనీసం ఏడాదికి ఒక్కసారైనా ఏసీని సర్వీసింగ్‌ చేయించడం మంచిది.
7/8ఏసీ ఉన్న గదిలోని చల్లటి గాలి బయటికి పోకుండా ఉండేందుకు తలుపులు, కిటికీలు ఎల్లప్పుడూ మూసేసి ఉంచాలి. అద్దాల కిటికీలు ఉంటే ఎండ గదిలోకి రాకుండా దలసరి కర్టెన్లను వేయాలి. అలాగే ఫ్రిజ్‌, టీవీలను ఏసీ గది బయటే ఉంచాలి. ఫ్రిజ్‌, టీవీ, కంప్యూటర్లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇవి ఏసీ గదుల్లో ఉంటే రూం చల్లబడటానికి చాలా సమయం తీసుకుంటుంది.
8/8ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్‌ వేసుకోవడం ఎందుకని చాలామంది అనుకుంటారు. కానీ ఏసీ నడుస్తున్న సమయంలో ఫ్యాన్‌ వేయడం వల్ల చల్లటి గాలి తొందరగా గది నలువైపులా వ్యాపిస్తుంది. రూం తొందరగా చల్లబడుతుంది. దీనివల్ల కరెంట్‌ ఆదా అవుతుంది.