మూసి ఉంచితే ముప్పే!
అటాచ్డ్ బాత్రూమ్ తలుపులను ఎక్కువగా మూసే ఉంచుతారు. అప్పుడే అది పరిశుభ్రంగా, దుర్వాసన ఇతర గదుల్లోకి వ్యాపించకుండా ఉంటుందని భావిస్తారు. అయితే, పరిశోధకులు మాత్రం.. ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు.
అటాచ్డ్ బాత్రూమ్ తలుపులను ఎక్కువగా మూసే ఉంచుతారు. అప్పుడే అది పరిశుభ్రంగా, దుర్వాసన ఇతర గదుల్లోకి వ్యాపించకుండా ఉంటుందని భావిస్తారు. అయితే, పరిశోధకులు మాత్రం.. ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. బాత్రూమ్ తలుపులను ఎప్పుడూ మూసి ఉంచడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు.
- బాత్రూమ్ అత్యంత తేమగా ఉంటుంది. నిరంతరం తలుపుల్ని మూసి ఉంచడం వల్ల లోపల గాలి సరిగ్గా ఆడక తడి త్వరగా ఆరిపోదు. దాంతో గోడలపై, టైల్స్ మధ్య బూజు చేరుతుంది. ఇది శ్వాసకోశ సమస్యలు, అలర్జీలను కలిగిస్తుంది.
- ఫ్లషింగ్ వల్ల ఏర్పడే ఏరోసోల్స్‌లో బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఫ్లష్ చేసినప్పుడు నీటి బిందువులతో పాటుగా గది మొత్తం వ్యాప్తి చెందుతాయి. ఆరోగ్యానికి అనేక రకాలుగా హాని కలిగిస్తాయి.
- గాలి ప్రసరణ లేకపోవడం వల్ల బాత్రూమ్లలో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. దీనివల్ల బాత్రూమ్లో ఒక రకమైన చెడు వాసన స్థిరపడిపోతుంది.
మరేం చేయాలి?
- బాత్రూమ్ వాడిన తర్వాత కనీసం 15-20 నిమిషాల పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంచాలి. ఇది తేమను, బ్యాక్టీరియాను బయటికి పంపేస్తుంది.
- ఫ్లష్ చేయడానికి ముందు టాయిలెట్ మూత తప్పకుండా వేయాలి. అప్పుడే క్రిములు గాలిలోకి వ్యాపించకుండా ఉంటాయి.
- బాత్రూమ్ వాడనప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేనప్పుడు.. తలుపును కాస్త తెరిచి ఉంచాలి. దీనివల్ల గాలి ప్రసరణ జరిగి లోపల పొడిగా మారుతుంది.
- బాత్రూమ్లో తరచుగా తాకే ఉపరితలాలను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

