శ్రీదేవి కూతురు శ్రీదేవి కూతురే. అతిలోక సుందరి తనయ అతిలోక సుందరి కాకుండా పోతుందా? జాన్వీ కపూర్ అనేది బర్త్ సర్టిఫికెట్‌కు మాత్రమే పరిమితమైన పేరు. తాను ధరించడం వల్లే వెల్వెట్ డిజిటల్ ప్రింటెడ్ లెహంగాకు కొత్త అందం వచ్చింది.
మెడలో ట్రైబల్ జువెలరీతో వనకన్యను తలపిస్తున్నది జూనియర్ శ్రీ. ఎగిసిపడే కురులు.. ఆమె స్వతంత్ర దృక్పథాన్ని చెబుతున్నాయి. పిడికెడు నడుము.. పిడిబాకులా కుర్రకారు గుండెలకు తీపిగాయం చేస్తున్నది.