ఆరుబయటో, పెరట్లోనో మొక్కల్ని పెంచడం అంత కష్టం కాదు. వాటి కోసం ఎలాంటి సౌకర్యాలు ఉండాలి అన్నది మన ఇష్టం. కానీ, ఇండోర్ గార్డెనింగ్ అలా కాదు. కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడి మంచి ఫలితాలు అందుకోవడం ఓ కళ. దానికోసం ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి..

ఇండోర్ గార్డెనింగ్ కోసం ఎంచుకునే మొక్కలు మరీ పెద్దగానూ, అలాగని చిన్నగానూ కాకుండా స్థలానికి సరిపడా ఉండాలి.
మొక్కలు బాగా పెరగాలంటే మట్టి ఎక్కువగా ఉండాలి. కానీ ఇంటి లోపల ఎక్కువ మట్టిని ఉంచడం సాధ్యం కాదు. దాని కోసం ఎరువు, జీవవ్యర్థాలు, మట్టి… వీటి మిశ్రమాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాలి.
వారానికి ఒకసారైనా నీరు పోయాలి, రోజుకు ఒకసారి మొక్కల్ని పైపైన తడుపుతూ ఉండాలి.. ఇండోర్ మొక్కల గురించి ఇలాంటి సూచనలెన్నో వినిపిస్తాయి. నిజానికి మనం వాడే మట్టి, పెరుగుతున్న మొక్కలు, ఇంట్లో వాతావరణం, బయటి ఎండలు… వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మొక్కలకు నీరు పోయాలి.
ఇంట్లో తేమని బట్టి ఎలాంటి మొక్కల్ని పెంచాలి అన్నది నిర్ణయించుకోవాలి. కొన్ని మొక్కలు అధికతేమలో ఉండలేవు. మరికొన్ని దోమలు లాంటి కీటకాలను ఆకర్షిస్తాయి.