ఆత్మీయుల సంగీత్‌లో సరిగమలనే కాదు.. మీ చేతి గాజుల చిరు సవ్వడులనూ, మీ కాలి మువ్వల నవ్వులనూ.. అతిథులకు పరిచయం చేయాలనుకుంటే ఇలాంటి ఫ్యూజన్ ఫ్రాక్ ధరించాల్సిందే. ఇక అందరి దృష్టీ మీ మీదే, అందరి దిష్టీ మీకే. భారీ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో ఈ డ్రస్‌కు జబర్దస్త్ లుక్ వచ్చింది.
ఫ్లోర్ లెన్త్, డబుల్ లేయర్డ్ డిజైన్.. ఆధునికతను కలబోసింది. హంగులు హెవీగానే ఉన్నా.. లైట్ వెయిట్ కాబట్టి సమ్మర్లో సమస్యే లేదు.