Parenting Tips | ఆ పద్ధతి ఫాలో అయితే కవలలు పుడతారా?
Parenting Tips | నమస్తే డాక్టర్‌గారు. నా వయసు 28 సంవత్సరాలు. నాకు కవల పిల్లలంటే ముచ్చట. మా చుట్టాల్లో ఒకరిద్దరికి కవల పిల్లలున్నారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కనొచ్చని విన్నాను. ఇది నిజమేనా. సహజంగా కవల పిల్లలు పుట్టేందుకు ఏమైనా పద్ధతులున్నాయా?
Parenting Tips | నమస్తే డాక్టర్‌గారు. నా వయసు 28 సంవత్సరాలు. నాకు కవల పిల్లలంటే ముచ్చట. మా చుట్టాల్లో ఒకరిద్దరికి కవల పిల్లలున్నారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లల్ని కనొచ్చని విన్నాను. ఇది నిజమేనా. సహజంగా కవల పిల్లలు పుట్టేందుకు ఏమైనా పద్ధతులున్నాయా?
-ఓ పాఠకురాలు
కవల పిల్లలు కడుపున పడటం అన్నది మీరనుకున్నట్టు ముచ్చటగా ఏం ఉండదు. ఇది చాలా రిస్కీ ప్రెగ్నెన్సీ. ఎందుకంటే కవలలు ఎలా ఏర్పడ్డారు అనేది చాలా ముఖ్యం. అంటే ఒకే అండం నుంచి ఏర్పడ్డారా, లేదా రెండు అండాల నుంచి ఏర్పడ్డారా, లేదా ఒకే అండం నుంచి పిండం ఏర్పడి ఎనిమిది వారాలలోగా అది రెండు పిండాలుగా విడిపోయిందా లాంటి అంశాలు ఇందులో కీలకం అవుతాయి. ఒక వేళ అలా విడిపోకపోతే అవిభక్త కవలలు పుట్టే అవకాశం ఉంది. కవలలు కడుపులో ఉన్నప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా పుట్టాలని ఏం లేదు. కొన్నిసార్లు ఒక బిడ్డ లోపలే చనిపోవచ్చు, మరో బిడ్డ ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఒక బిడ్డ చుట్టూ ఉన్న నీరు తగ్గిపోవచ్చు, మరో బిడ్డ చుట్టూ నీరు ఎక్కువ అవ్వొచ్చు… లేదా లోపల ఏదన్నా సమస్య వస్తే తల్లికి బీపీ పెరగొచ్చు. అది బిడ్డకు ప్రాణాపాయంగా మారుతుంది. నెలలు నిండకుండా ప్రసవించడం, అబార్షన్ల లాంటివీ ఇలాంటప్పుడు ఎక్కువగా జరుగుతుంటాయి.
ఈ తరహా ప్రెగ్నెన్సీలో తల్లికి గుర్రపువాతం వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఇక, ఐవీఎఫ్ పద్ధతిలోనూ అందరికీ కవల పిల్లలు పుడతారన్న గ్యారెంటీ ఏమీ లేదు. రెండు పిండాలు ప్రవేశ పెట్టినా అవి ఎంత వరకూ సఫలమవుతాయన్నది మనం కచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఈ పద్ధతిలో కవల పిల్లలు పుట్టడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే వంశపారంపర్యంగా ఉంటే మాత్రం కవల పిల్లలు పుట్టొచ్చేమో కానీ, కవల పిల్లలు పుట్టేందుకంటూ సహజ పద్ధతులేం లేవు. ఒకేసారి ఇద్దరు పసిపిల్లలు ఉంటే వాళ్ల ఆలనాపాలనా సరిగ్గా చూసుకోవడం కష్టమవుతుంది. కొన్నిసార్లు తల్లిపాలకూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కవల పిల్లల పెంపకం కూడా అంత ఆషామాషీ వ్యవహారమేం కాదు.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

