New Year Resolutions | లాస్ట్ న్యూ ఇయర్‌కు మీరు తీసుకున్న తీర్మానాలు ఎంతవరకు ఫాలో అయ్యారు.. ఈ ఏడాది మాత్రం ఈ మిస్టేక్స్ వద్దు!!
New Year Resolutions | స్మోకింగ్‌కు దూరం, మందుకు రామ్రామ్, వాకింగ్‌కు జై, డైటింగ్‌కు సై.. పక్షం రోజుల క్రితం పార్టీ చేసుకుంటూ తీసుకున్న తీర్మానాల సంగతేమిటి? ఓ అంచనా ప్రకారం.. ఇరవై ఐదు శాతం మంది జనవరి చివరి వరకు మాత్రమే కొత్త సంవత్సర తీర్మానానికి కట్టుబడి ఉంటారు.
New Year Resolutions | స్మోకింగ్‌కు దూరం, మందుకు రామ్రామ్, వాకింగ్‌కు జై, డైటింగ్‌కు సై.. పక్షం రోజుల క్రితం పార్టీ చేసుకుంటూ తీసుకున్న తీర్మానాల సంగతేమిటి? ఓ అంచనా ప్రకారం.. ఇరవై ఐదు శాతం మంది జనవరి చివరి వరకు మాత్రమే కొత్త సంవత్సర తీర్మానానికి కట్టుబడి ఉంటారు. తొలివారంలోనే చేతులెత్తేసేవారు నలభై ఎనిమిది శాతం. ఒక్కోనెల గడిచేకొద్దీ.. ఎంతో కొంతమంది అస్త్ర సన్యాసం చేస్తారు. డిసెంబరు-2023 వరకూ అంతే ఉత్సాహంగా, అదే పట్టుదలతో కట్టుబడి ఉండేవారు ఎనిమిది శాతమే. ఆ కొద్దిమందిలో మీరూ ఉండాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
పెద్ద లక్ష్యాలను చిన్నగా విభజించుకోండి. ఏడాదిలో పది కేజీల బరువు తగ్గాలన్న తీర్మానం మంచిదే. కానీ, దాన్ని పది ముక్కలు చేసుకుని.. నెలకు ఒక కేజీ తగ్గినా చాలని అనుకుంటే.. తేలిక అవుతుంది. ఒక నెల కుదరకపోయినా, ఇంకోనెల సాధిస్తాం. ఏడాది చివరికి ఏడెనిమిది కిలోలు వదిలించుకోవడం ఖాయం.
కోటీశ్వరుడు కావాలనే కోరిక కాదనలేనిదే. కానీ, వంద లక్షలు పోగైతేనే కోటి అవుతుంది. కాబట్టి, నెలనెలా ఎంత పొదుపు-మదుపు చేయాలనే విషయంలో స్పష్టత పెంచుకోండి. గాలిమేడలు వద్దు.
సిగరెట్ మానేయాలన్న నిర్ణయానికి అభినందనలు. ఆ ప్రయత్నంలో చిన్నచిన్న వైఫల్యాలు ఎదురైనా పట్టించుకోకండి. ఉదాహరణకు కొంతమంది.. స్నేహితుల బలవంతంతోనో, వ్యసనం తాలూకు బలహీనత కారణంగానో.. సిగరెట్ ముట్టిస్తారు. ఎలాగూ మళ్లీ మొదలుపెట్టాం కదా అని.. పాత అలవాటే కొనసాగిస్తారు. ఇది తప్పు. ఆ అనుభవాన్ని పాఠంలా మాత్రమే తీసుకోవాలి. పట్టుదలతో ముందుకెళ్లాలి.
మనసు చాలా శక్తిమంతమైంది. ఆ శక్తిని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోండి. మీ సంకల్పబలాన్ని పెంచుకోండి. ఆ ప్రయత్నంలో ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ ఓ పది నిమిషాలు మీ ఆలోచనలను గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం. దీనివల్ల మీరు వేరు, మీ ఆలోచనలు వేరు అన్న ఎరుక సాధ్యం అవుతుంది. తీర్మానానికి కట్టుబడి ఉండాలన్న పట్టుదల పెరుగుతుంది.
పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలనుకోవడం మంచి తీర్మానమే. అంతలోనే, ‘నాకు సమయం లేదు’, ‘పుస్తకం చదివితే కంటికి శ్రమ’, ‘పుస్తకాల రేట్లు బాగా పెరిగిపోయాయి’, ‘అయినా చదవదగిన పుస్తకాలు ఎక్కడొస్తున్నాయి?’.. తరహా సాకులతో ఓ మంచి అలవాటును మూలనపడేయకండి. ఏ వాకింగ్లోనో ఆడియో బుక్స్ వినండి. ధర ఎక్కువనిపిస్తే సెకండ్స్లో ప్రయత్నించండి. కొత్త పుస్తకాలలో సరుకు లేదనిపిస్తే.. క్లాసిక్స్ ఎంచుకోండి. మనసుంటే మార్గం ఉంటుంది.
కొన్ని సందర్భాల్లో ఎవరో ఒకరి మద్దతు అవసరం అవుతుంది. నిపుణుల సలహా తప్పనిసరి కావచ్చు. బరువు తగ్గే విషయంలో డైటీషియన్ అభిప్రాయం తీసుకోండి. వ్యసనాలు వదలకపోతే మానసిక నిపుణులను సలహా అడగండి. తీర్మానం అమలులో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. ఫ్యామిలీ డాక్టర్‌తో మాట్లాడండి.
స్నేహితులు, బంధువులు, కొలీగ్స్‌లో మీలాంటి తీర్మానమే తీసుకున్న వాళ్లు కొందరైనా ఉంటారు. అంతా కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ప్రారంభించండి. లక్ష్యాలు, గెలుపులు, సవాళ్లు ..మనసులోని భావాలన్నీ పంచుకోండి.
చివరగా ఒక మాట. మీ పరిధిలోలేని విషయాల జోలికి వెళ్లకండి. ఫలానా అమ్మాయిని ప్రేమించాలనో, పెండ్లి చేసుకోవాలనో తీర్మానిస్తే మూర్ఖత్వమే అవుతుంది. మీ తీర్మానం మరొకరి జీవితాన్ని ప్రభావితం చేయలేదు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

