Festival Season | పండుగల వేళ లావైపోతే ఎలా? ఏ జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ సాధారణ స్థితికి రావచ్చు?
బతుకమ్మ, దసరా, దీపావళిలాంటి పండుగలు వరుసగా వస్తున్నాయి. స్వీట్లు, నూనెల్లో వేయించిన పదార్థాలు ఈ సమయంలో ఎక్కువగా తింటాం. దీనివల్ల శరీరంలో కేలరీలు అధికం అయిపోయి.. బరువు పెరుగుతాం కదా! మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
Festival Season | బతుకమ్మ, దసరా, దీపావళిలాంటి పండుగలు వరుసగా వస్తున్నాయి. స్వీట్లు, నూనెల్లో వేయించిన పదార్థాలు ఈ సమయంలో ఎక్కువగా తింటాం. దీనివల్ల శరీరంలో కేలరీలు అధికం అయిపోయి.. బరువు పెరుగుతాం కదా! మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఓ పాఠకురాలు
పండుగల సమయంలో మనం ఇంట్లో చేసుకునే ఆహార పదార్థాలు చాలా వరకూ మంచి చేసేవే. ముఖ్యంగా బతుకమ్మ సంబురాల సమయంలో రోజుకో రకం పెట్టే నైవేద్యాల్లో పోషక విలువలు అధికం. మిగతా స్వీట్లలాంటివీ పండుగల వేళ తింటాం. అయితే బయటి వాటికన్నా ఇంట్లో చేసుకున్నవి తింటే మేలు. పండుగలప్పుడు మామూలు కన్నా కాస్త ఎక్కువే లాగిస్తామన్నది నిజమే. కానీ, ఆ సమయంలో శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి కేలరీలు బాగానే ఖర్చవుతాయి. దానికోసం మరీ భయపడాల్సిన పనిలేదు. ఇంట్లో స్వీట్లు చేసుకునేప్పుడు పంచదార బదులు బెల్లం, కండ చక్కెరలాంటివి వాడుకోవాలి. అలాగే పాలతో చేసే పాయసం, రసమలైలాంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
వాటిని కూడా మరింత ఆరోగ్యంగా చేసుకోవాలనుకుంటే కొర్రల పాయసం, రాగి లడ్డూలు, నువ్వులుండల్లాంటివి ఎంచుకోవచ్చు. డ్రైఫ్రూట్, కొబ్బరి లడ్డూలూ మంచివే. గుమ్మడి, అవిశె, పొద్దుతిరుగుడు గింజలతోనూ లడ్డూలు చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ హల్వా ప్రయత్నించవచ్చు. వీటిలో వాడే నెయ్యిలో ఆరోగ్యకర కొవ్వులు లభిస్తాయి. కొర్రల్లాంటి వాటిలో అధిక ఫైబర్, రాగుల్లో క్యాల్షియం, బెల్లంలో ఐరన్ ఉంటాయి. వీటిద్వారా బోలెడు పోషకాలను శరీరానికి అందించవచ్చు. భోజనానికి ముందు కొద్ది మొత్తంలో సలాడ్లు, లేదా పండ్లు తీసుకోవడం వల్ల కాస్త మితంగా తింటాం. నచ్చినవి తింటూనే, కాస్త ఆరోగ్య కోణంలోనూ ఆలోచిస్తే పండుగను ఆనందంగా ఆస్వాదించవచ్చు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

