Apps:
Follow us on:

Household Tips | పట్టుబట్టలపై మరకలను ఇలా ఈజీగా తొలగించండి

1/8పెండ్లిళ్లు, శుభకార్యాలు అనగానే చాలామంది పట్టుబట్టలకు ప్రిఫర్‌ చేస్తారు. ఆలయాలకు వెళ్లినా.. పూజలు చేసినా సరే పట్టువస్త్రాలు ధరించడానికే ప్రాధాన్యతనిస్తారు. ఇక ఆడవాళ్లకు పట్టుచీరలపై ఉన్న మక్కువ గురించి చెప్పక్కర్లేదు.
2/8మన జీవితంలో అంతలా ప్రాముఖ్యం పొందిన పట్టుబట్టలను ధరించినప్పుడు అందంగా, రిచ్‌గా కనిపిస్తాం. కానీ ఏదైనా మరకలు పడినప్పుడే వాటిని పోగొట్టేందుకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఎంత ప్రయత్నించినా మొండి మరకలను పూర్తిగా తొలగించలేక చాలామంది ప్రయాసపడుతుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మరకలను ఈజీగా తొలగించుకోవచ్చు.
3/8పట్టుబట్టల మీద చాక్లెట్ మరకలు పడితే వేడినీటిలో జాడించి ఉతికితే పోతాయి. పెరుగు, వెన్న వంటి మరకలు పడితే మరకపై ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉపయోగించాలి.
4/8పట్టుబట్టల మీద కాఫీ లేదా టీ మరకలు పడితే కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను పూస్తే మరకలు పోతాయి. అప్పటికీ పోకపోతే వేడి నీటిలో కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఆ నీటిలో ఉతకాలి.
5/8బురద మట్టి మరకలు పడితే పట్టువస్ర్తాన్ని ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్‌తో తుడిచి ఉతికితే సరిపోతుంది. షూ పాలిష్ మరకలు పడితే కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్ వేసి రుద్ది ఆ తర్వాత ఆల్కహాల్ పూయాలి.
6/8పట్టుబట్టల మీద ఇంక్ లేదా లిప్‌స్టిక్ మరకలు పడితే ఆ భాగంలో పేపర్ టవల్‌ను ఉంచి వెనుకనుంచి డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్ పూయాలి. మరక పూర్తిగా పోయేవరకు నీటిని వాడరాదు. అదే నెయిల్ పాలిష్ పడితే ఆ భాగం వరకు అసిటోన్‌లో ముంచితే సరిపోతుంది.
7/8పట్టుబట్టలను ప్లాస్టిక్ సంచుల్లో లేదా పేపర్, కాటన్ సంచుల్లోనే ఉంచాలి. పట్టుబట్టలున్న చోట ఎక్కువ గాలి, కాంతి లేకుండా చూడాలి. పట్టుబట్టలను చెక్క లేదా కలపతో చేసిన పెట్టె లేదా బీరువాలో నేరుగా తాకేలా కాకుండా కవరులో పెట్టి పెట్టాలి
8/8పట్టుబట్టలను అప్పుడప్పుడు బయటకు తీసి గాలి సోకనీయాలి. లేకుంటే ముడతలు పడిన చోట చిరుగులు పడే అవకాశం ఉంది.