మన ఇంట్లోని దుస్తుల్ని నీట్‌గా సర్ది వార్డ్‌రోబ్‌లో పెట్టేస్తాం. ఎంత చక్కగా సర్దినా వానాకాలంలో పెరిగే తేమ వార్డ్‌రోబ్‌లో తిష్టవేస్తుంది. డోర్ తీయగానే ముతక వాసన గుప్పుమంటుంది. అలా జరగకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఎలాంటి కెమికల్స్ వాడకుండా నేచరల్ టిప్స్‌తో వార్డ్రోబ్ వాసనల నుంచి తప్పించుకునే ఉపాయం మీకోసం..
కనిపెట్టండి: మనం గమనించం కానీ వార్డ్‌రోబ్‌లో ఎప్పట్నుంచో దుస్తుల్ని అలానే పెట్టేసి ఉంచుతాం. అవి అలా ముకిపోయి వాసనలు వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే ఒకసారి దుస్తులన్నీ బయటికి తీయండి. అప్పుడు ఏవైనా దుస్తుల నుంచి ఎకువ వాసనలు వస్తే వాటిని పకనపెట్టి ఓ సారి క్లీన్ చేయండి. అలానే కాస్తా తడిగా ఉన్న దుస్తుల్ని లోపల పెట్టినా వాసన వస్తుంటాయి. పూర్తిగా ఆరిన వాటినే వార్డ్‌రోబ్‌లో ఉంచాలి.
కారణం వెతకండి: ఓ లైట్ తీసుకుని వార్డ్‌రోబ్‌లో మొత్తం వెతకండి. వాసనకి ఏదైనా కారణం కనిపిస్తుందో చూడండి. అల్మారా అయితే కాస్తా తకువ వాసన ఉంటుంది. చెక వార్డ్రోబ్ అయితే ఎకువగా వాసన వస్తుంది. సమస్య ఎకడుందో గుర్తించి దానిని పరిహరించండి.
ఓ సారి దులపండి: దుస్తులన్నీ బయటికి తీశాక లోపలి దుమ్ముని మొత్తం ఓ సారి దులపండి. అవసరమైతే ఓ స్పాంజ్‌ని నీటిలో ముంచి తుడిచి మళ్లీ పొడి వస్త్రంతో తుడవండి. దీంతో మొండివాసనలు దూరమవుతాయి. అయితే, తుడిచాక కచ్చితంగా పొడిగా తుడవటం తప్పనిసరి. లేదంటే మళ్లీ తేమ పెరిగి క్రిములు వచ్చే అవకాశం ఉంది. తుడిచిన తరువాత వార్డ్రోబ్ను రెండ్రోజుల పాటు తెరిచి ఉంచాలి. దీనివల్ల లోపలి వాసనలు బయటికి పోతాయి. ఖాళీగా ఉంచడం వల్ల మూలమూలల్లో ఉన్న తేమ మొత్తం కూడా ఆరిపోతుంది. దీంతో వాసన కూడా రాదు.
బెస్ట్ ఐడియా: ఇన్ని చేశాక కూడా వాసనలు ఇంకా వదలకపోతే ఓ గిన్నెలో బేకింగ్ సోడా వేసి వార్డ్‌రోబ్‌లో పెట్టి డోర్ వేయండి. దీంతో మరుసటిరోజుకి వాసనలు చాలా వరకూ తగ్గుతాయి. తగ్గకపోతే మరోసారి అలానే చేయండి. ఇలా చేసి తిరిగి దుస్తుల్ని ఒకొకటిగా మళ్లీ సర్దండి. దుస్తులన్నీ ఒకేచోట కుక్కకుండా ఫ్రీగా ఉండేలా మడతపెట్టి సర్దండి.